‘ఆ రోజులను చాలా మిస్ అవుతున్నా’.. రష్మిక పోస్ట్ వైరల్!

నేషనల్ క్రష్ గా ప్రేక్షకుల చేత పిలిపించుకుంటూ రష్మిక మందన్న( Rashmika Mandanna ) పాన్ ఇండియన్ వ్యాప్తంగా అన్ని భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకు పోతుంది.

రష్మిక మందన్న ఛలో, ( Chalo )భీష్మ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

అందుకే ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. """/" / హిందీ, తెలుగు, తమిళ్ వంటి భాషల్లో వచ్చిన అవకాశాన్ని వద్దు అనకుండా చేసుకుంటూ పోతుంది.

ఈ ఏడాది అప్పుడే తమిళ్ లో విజయ్ సరసన వారిసు సినిమాలో నటించి మంచి విజయం అందుకుంది.

ఇక ప్రస్తుతం పుష్ప ( Pushpa Movie )సీక్వెల్ లో నటిస్తూనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

ముఖ్యంగా ఈ అమ్మడికి బాలీవుడ్ లో ప్లాప్ పడిన వరుస అవకాశాలు వరిస్తున్నాయి.

"""/" / సౌత్ టు నార్త్ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు కూడా రెడీ అవుతుంది.అయితే తాజాగా ఈ భామ ఒక పోస్ట్ చేసింది.

తాను ఇప్పుడు ఒకప్పటి ట్రావెలింగ్ రోజులను మిస్ అవుతున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ పోస్ట్ షేర్ చేస్తూ ఈమె పంచుకున్న పిక్ నెట్టింట వైరల్ అయ్యింది.

''మొదటి చిత్రం గమ్యస్థానం.వీడియోలను వెతికేందుకు ప్రయత్నిస్తున్నాను.

ట్రావెలింగ్ రోజులను మిస్ అవుతున్నాను'' అంటూ ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.

ఇదిలా ఉండగా ఈ భామ ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో ఏదోకటి రిలీజ్ అయితే కానీ ఈమె మళ్ళీ ట్రెండ్ లోకి రాదు.

ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న ఆ సినిమాలు రిలీజ్ అయితే మరోసారి మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం అయితే ఉంది.

అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ సినిమాతో సక్సెస్ సాధించాడా..?