మూడేళ్ళ క్రితం చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్.. రష్మిక అసలేం ట్వీట్ చేసిందంటే?

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న ను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు.

ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.

అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.

ఈమె కెరీర్ లో సరిలేరు నీకెవ్వరూ, భీష్మ, పుష్ప లాంటి సక్సెస్ లు వచ్చాయి.

పుష్ప 2 సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇది కాకుండా ఈమె బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా మారిపోవాలని ప్రయత్నాలు సాగిస్తుంది.

అలాగే ఇంకో పక్క కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడు నటించడానికి సిద్ధంగా ఉంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో రష్మిక నటిస్తుందని ప్రకటించిన విషయం విదితమే. """/"/ కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన నటించే ఛాన్స్ అందుకోవడంతో ఈమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె మూడేళ్ళ క్రితం హీరో విజయ్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

విజయ్ అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి.

"""/"/ ఆ రూమర్స్ పై స్పందిస్తూ రష్మిక 2018 నవంబర్ 27న ఒక ట్వీట్ చేసింది.

విజయ్ అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలో మీరు నటిస్తున్నారా అని అందరు నన్ను అడుగుతున్నారు.

కానీ నాకు అవకాశం రాలేదు.త్వరలోనే వారితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను'' అంటూ రష్మిక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఈమెకు విజయ్ తో చేసే అవకాశం వచ్చింది.దీంతో ఈమె ఫ్యాన్స్ ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ వైరల్ చేసారు.

ఇన్నాళ్లకు ఈ జంటను తెరమీద చూడబోతున్నాం అని కామెంట్స్ చేస్తూ వారి ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

కెనడా చరిత్రలోనే అతిపెద్ద చోరీ .. త్వరలో లొంగిపోనున్న భారత సంతతి వ్యక్తి, లాయర్‌తో వర్తమానం