బీచ్ లో కష్టపడుతున్న ముద్దుగుమ్మ రష్మిక
TeluguStop.com
క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ వరుస హిట్ లతో దూసుకుపోతున్న బెంగుళూరు భామ రష్మిక మందన తన కెరియర్ విషయంలో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది.
సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ప్రస్తుతం పుష్ప సినిమా కోసం రెడీ అవుతుంది.
ఇక లాక్ డౌన్ ముగిసి షూటింగ్ లు మొదలు కావడంతో మరల ఉత్సాహంగా షూటింగ్ ల కోసం ఎదురుచూస్తుంది.
పుష్ప సినిమా ఎంత వేగంగా స్టార్ట్ అవుతుందా, ఎంత వేగంగా షూటింగ్ లో జాయిన్ కావాలా అనే ఆలోచనతో ఉంది.
ఇదిలా ఉంటే పుష్ప సినిమాతో ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం తమిళంలో సుల్తాన్ సినిమా కూడా ఉంది.
దీంతో పాటు ఆచార్యలో రామ్ చరణ్ కి జోడీగా ఈ భామ ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.
అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.
ఇక లాక్ డౌన్ లో దొరికిన ఖాళీ సమయాన్ని ఆమె ఫుల్ గా వాడేసుకుంటుంది.
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేయడంతో పాటు చాలా సంతోషంగా గడిపేసింది.ఇదే సమయంలో ఆమె ఫిజిక్ విషయంలో ఏమాత్రం లైట్ తీసుకోకుండా వర్కౌట్స్, యోగా చేస్తుంది.
తాజాగా రష్మిక ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో బీచ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
ఆ వీడియోలో ఇసుకలో ఆమె తెగ కష్టపడుతోంది.సమంతని స్ఫూర్తిగా తీసుకొని ఆమె తరహాలోనే ఫిజిక్ మెయింటేన్ చేయాలని రష్మిక అనుకుంటుంది.
దానికోసం తన స్లిమ్ పర్సనాలిటీలో తేడాలు రాకుండా గట్టిగా కష్టపడుతుంది.మొత్తానికి ఆమె కష్టం చూస్తూ ఉంటే ఎలా అయినా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ కావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది.
అమెరికా: భారతీయుల జీవితాలు అల్లకల్లోలం.. వీసాల గందరగోళంతో ఆందోళన.. అసలేం జరుగుతోంది?