వీల్ చైర్ లో నటి రష్మిక మందన్న…షాక్ లో అభిమానులు!

రష్మిక( Rashmika ) ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇటీవల పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న రష్మిక త్వరలోనే మరో బాలీవుడ్ చిత్రం ఛావా( Chhaava ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమాలో ఈమె మహారాణి పాత్రలో కనిపించబోతున్నారు.ఇక ఈ సినిమా వచ్చే నెల 14వ తేదీ ప్రేక్షకులం ముందుకు రాబోతోంది.

"""/" / ఇలా వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటూ మరోవైపు సినిమాల ప్రమోషన్లలో కూడా బిజీగా గడుపుతున్న రష్మిక ఉన్నఫలంగా వీల్ చైర్ లో కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.

నడవలేని స్థితిలో ఈమెను వీల్ చైర్ లో తీసుకు వెళుతున్నటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి రష్మిక ఇలాంటి స్థితిలో ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

"""/" / ఇక ఈమె ఈ ఏడాది మొదట్లోనే జిమ్ లో వ్యాయామం చేస్తూ గాయాలు పాలయ్యారు.

ఈమె కాలికి గాయం కావడంతో నడవలేని స్థితిలో ఉన్నట్టు తెలియజేశారు.తన గాయం ఎప్పుడు బాగవుతుందో దేవుడికే తెలియాలని రష్మిక గత కొద్దిరోజులుగా ఒక పోస్ట్ చేశారు.

కానీ ఈమె ఆ నొప్పి కారణంగా కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది.

తాజాగా ఈమె శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.మొహం కనిపించకుండా క్యాప్ మాస్క్ పెట్టుకొని ఉన్న ఈమెను తన స్టాప్ వీల్ చైర్( Wheel Chair) లో తీసుకు వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇది చూసిన ఫాన్స్ రష్మిక ఇంత నొప్పితో బాధపడుతోదా ఈమె త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నాగచైతన్యకు ఆ స్టార్ హీరో అభిమానుల సపోర్ట్.. తండేల్ బ్లాక్ బస్టర్ కావడం పక్కా!