రష్మిక రేంజ్ పడిపోయిందా? మహేష్ బాబు సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్?
TeluguStop.com
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన కలిసి నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు.
ఈ సినిమాలో రష్మిక మందన అలాగే మహేష్ బాబుల కామెడీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రష్మిక మందన ఈ సినిమా తర్వాత మరొకసారి అలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకోను అంటూ తెగేసి చెప్పిన విషయం తెలిసిందే.
ఈ సినిమా బాగానే ఉన్నప్పటికీ ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం రష్మిక మీద ట్రోలింగ్స్ చేయడంతో ఆమె రియలైజ్ అయ్యి మళ్లీ అటువంటి పాత్రలు చేయను అని తెగేసి చెప్పింది.
అయితే మహేష్ బాబు సినిమా కదా తన క్రేజ్ పెరుగుతుంది అనుకొని ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్న రష్మిక మందన ఊహించని విధంగా ట్రోలింగ్స్ ఎదుర్కోవడంతో మళ్లీ అటువంటి పాత్ర చేయనని తెలిపింది.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త తెగ వైరల్ అవుతోంది.
అదేమిటంటే రష్మిక మందన మహేష్ బాబు సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.అయితే ఆ సినిమాలో రష్మిక తో ఐటెం సాంగ్ చేయించాలి అన్న ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే త్రివిక్రమ్ తన సినిమాలలో గతంలో కాజల్,తమన్నా, సమంత లాంటి హీరోయిన్ లు ఐటెం సాంగ్స్ చేసిన విషయం తెలిసిందే.
అయితే వాళ్ళందరూ స్టార్ హీరోయిన్ లుగా కొనసాగుతున్నప్పటికీ ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు.
"""/"/
మరి రష్మిక మందన కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందా లేదా అంటే ఆమె చేయడానికి మొగ్గు చూపుతోంది అంటూ ఒక వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఇందులో నిజా నిజాలు తెలియాలి అంతే రష్మిక మందన స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే మరి.
ప్రస్తుతం రష్మిక మందన వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే.
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది.
ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ సినిమాలలో నటిస్తే బిజీబిజీగా ఉంది.