”ది గర్ల్ ఫ్రెండ్”గా రాబోతున్న రష్మిక.. ఎట్టకేలకు మరో తెలుగు ప్రాజెక్ట్ అనౌన్స్!

ఛలో, భీష్మ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఆమె గురించి అందరికి తెలుసు.నేషనల్ క్రష్ గా ప్రేక్షకుల చేత పిలిపించుకుంటూ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) పాన్ ఇండియన్ వ్యాప్తంగా అన్ని భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకు పోతుంది.

ప్రస్తుతం ఈ భామ పుష్ప సీక్వెల్ లో నటిస్తూనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

బాలీవుడ్ లో ఈమె చేస్తున్న యానిమల్ సినిమా గురించే ఇప్పుడు ఎక్కడ చూసిన రచ్చ జరుగుతుంది.

యానిమల్ లో అమ్మడు రణబీర్ తో చేసిన లిప్ లాక్స్ తో అమ్మడి పేరు మారుమోగి పోతుంది.

ఇక వీటితో పాటు రెయిన్ బో సినిమా కూడా చేస్తుంది. """/" / అలాగే కోలీవుడ్ లో ధనుష్( Dhanush ) సరసన కూడా ఒక మూవీ చేస్తుంది.

దీనిని మన టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు.మరి రష్మిక ఇన్ని సినిమాలు చేస్తూనే ఇప్పుడు మరో సినిమాను ప్రకటించింది.

తెలుగులో పుష్ప మినహా మరో సినిమా చేయడం లేదని అనుకుంటుంటే ఇప్పుడు తెలుగులో కొత్త సినిమాను ప్రకటించింది.

"""/" / తాజాగా రష్మిక కొత్త సినిమా అప్డేట్ ఈ రోజు వచ్చింది.

రష్మిక లీడ్ రోల్ లో ''ది గర్ల్ ఫ్రెండ్'' అనే సినిమాను ప్రకటించారు.

నటుడు రాహుల్ రవీంద్రన్ రచన దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా రష్మిక రోల్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది.

ఈ చిన్న వీడియో చాలా థ్రిల్లింగ్ గా ఉంది.హేషం అబ్దుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ రోజే అంచనాలు క్రియేట్ చేసుకుంది.

అజయ్ భూపతి ధనుష్ కాంబో సెట్ అవుతుందా..?