బిగ్ బి తో రష్మిక బ్యూటిఫుల్ ఫోటో.. నెట్టింట షేర్ చేసిన నేషనల్

టాలీవుడ్ లో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కు ప్రస్తుతం వరుస సినిమాల ఆఫర్లు వస్తున్నాయి.

అతి తక్కువ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో పరిచయమయ్యి.స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

అంతేకాకుండా తను సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది.

ఈమె సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.

ఈ సినిమా హిట్ తో రష్మిక పేరు కూడా బాలీవుడ్ లో మారుమోగి పోయింది.

ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ అమ్మడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

కన్నడ నుంచి టాలీవుడ్ లోకి వచ్చిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో ఏకంగా రెండు సినిమాలలో అవకాశం దక్కించుకుంది.

ప్రెసెంట్ ఈమె బాలీవుడ్ మీద తన ఫోకస్ పెట్టింది.ఆ మధ్య బాద్ షా పాట లోను నటించిన ఈ అమ్మడు తెలుగు కన్నడ తో పాటు బాలీవుడ్ లోను వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.

ఇక ఈ అమ్మడు తన ప్రతి విషయన్నీ సోషల్ మీడియాలో పెడుతూనే ఉంటుంది.

సినిమాల అప్డేట్ ల నుండి లేటెస్ట్ ఫోటోల వరకు అన్నిటిని పెడుతూ ఉంటుంది.

"""/"/ తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేసింది.

అది కాస్త వైరల్ అవుతుంది.ఈమె ప్రెసెంట్ మిషన్ మజ్ను, గుడ్ బై అనే రెండు బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది.

గుడ్ బై సినిమాలో బావు లెజెండ్ బిగ్ బి అమితాబ్ కూడా నటిస్తుండడం విశేషం.

ఈ సినిమా షూట్ లో భాగంగా అమితాబ్ బచ్చన్ ఉన్న ఫోటో నెట్టింట పోస్ట్ చేసింది.

ఈ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఓన్లీ అండ్ ఓన్లీ గ్రాటిట్యూడ్ స్మైల్స్ అండ్ లవ్ అంటూ ఈమె ఈ ఫోటోను షేర్ చేసింది.

గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌ చనిపోయినట్లుగా ప్రచారం.. అవాస్తవమన్న అమెరికా పోలీసులు