బేబీ సినిమా చూస్తూ ఏడ్చేసాను…. బేబీ సినిమా పై రివ్యూ ఇచ్చిన రష్మిక!
TeluguStop.com
సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) బేబీ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రలలో సాయి రాజేష్(Sai Rajesh) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ(Baby) .
ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా ప్రీమియర్ షో ల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.
"""/" /
ఆనంద్ దేవరకొండ ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన ఈయనకు ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం పడలేదు.
ఆయన ఖాతాలో ఇది తొలి హిట్ సినిమా అని చెప్పాలి.ఇక ఈ సినిమా పట్ల ఎంతోమంది సెలెబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే నటి రష్మిక మందన్న కూడా ఈ సినిమాపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
బేబీ సినిమాను చూసాను ఈ సినిమాలో అద్భుతమైన ఎమోషనల్ పర్ఫామెన్స్ చూసి కన్నీళ్లు వచ్చాయి.
ప్రతి సన్నివేశం నా హృదయంలో చిరకాలం నిలిచిపోతుంది చిత్ర బృందానికి అభినందనలు అంటూ ఈ సందర్భంగా ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఇక ఈమె బేబీ సినిమా చూడటం కోసం రశ్మిక రహస్యంగా థియేటర్ కి వెళ్లిన విషయం మనకు తెలిసిందే.
ప్రేక్షకులు ఎవరు తనని గుర్తించకుండా క్యాప్, మాస్క్ ధరించి రహస్యంగా సినిమా చూడటం కోసం థియేటర్ కి వెళ్లారు.
ఇక ఈ సినిమా చూసిన అనంతరం ఈ సినిమా పైన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఇలా బేబీ సినిమా గురించి రష్మిక ఇంట్రెస్ట్ చూపడంతో మరోసారి విజయ్ దేవరకొండ రష్మిక డేటింగ్ రూమర్స్ తెరపైకి వస్తున్నాయి.
ఆ విషయం తెలిసి ఎమోషనల్ అయిన ఏఎన్నార్.. నాగ్ నిర్ణయంతో అలా జరిగిందా?