జెర్సీ హిందీ రీమేక్ లో అందుకే చేయలేదు అంటున్న రష్మిక

టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన అందాల భామ రష్మిక మందన ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ కి జోడీగా నటిస్తుంది.

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.అయితే ఆమె కమర్షియల్ సినిమాలు చేస్తున్న మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలే దక్కుతున్నాయి.

అయితే ఆ మధ్య ఆమెకి జెర్సీ హిందీ రీమేక్ లో నటించే అవకాశం వచ్చింది.

అయితే ఆ సినిమా చేయడానికి ఆమె అంగీకరించలేదని టాక్ వినిపించింది.జెర్సీ లాంటి సినిమాలో నటించడానికి స్కోప్ ఉన్న పాత్రని రష్మిక ఎందుకు వదులుకుంది అనే డౌట్ అందరికి వచ్చింది.

తాజాగా రిపబ్లిక్‌ న్యూస్‌ ఇంటర్యూలో రష్మీక దీనిపై క్లారిటీ ఇచ్చింది.అవును నేను జెర్సీలో నటించాడానికి ఒప్పుకోలేదు.

ఎందుకంటే నేను ఎంపిక చేసుకునే సినిమాల ద్వారానే మంచి అవకాశాలు వచ్చాయి.జెర్సీ సినిమాలో హీరోయిన్ పాత్ర ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ నేను నటించినవన్ని కమర్షియల్‌ చిత్రాలే.

జెర్సీ చాలా రియలిస్టిక్ స్టొరీ.నేను ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలని అనుకుంటున్న.

ఒకవేళ నేను ఈ సినిమాకు సైన్‌ చేసిన అనుకున్న స్థాయిలో న్యాయం చేసేదానిని కాదు.

నా వల్ల సినిమాకి కచ్చితంగా బ్యాడ్ మార్క్ వస్తుంది.ఈ విషయాన్ని ఆలోచించే సినిమాని వదులుకున్న అని చెప్పింది.

మొత్తానికి రష్మిక చాలా సున్నితంగా సమాధానం చెప్పి ప్రస్తుతం తన దృష్టి మొత్తం స్టార్ హీరోయిన్ గా ఎదగడంపైనే ఉంది అని చెప్పకనే చెప్పింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

హమ్మో, అంత పెద్ద రాయిని బొమ్మ లాగా ఎత్తాడే.. ఈ పోటీ చూస్తే..??