ఆ సినిమా నుంచే నేషనల్ క్రష్ ట్యాగ్.. హీరోయిన్ రష్మిక షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ రష్మిక.ఇటీవల కాలంలో రష్మిక నటించిన సినిమాలు అన్ని వరుసగా సూపర్ హిట్ అవుతుండడంతో ఈమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.

టాలీవుడ్ లో వరుస విషయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బెంగుళూరు బ్యూటీ, యానిమ‌ల్ సినిమాతో బాలీవుడ్ లో కూడా స‌త్తా చాటింది.

"""/" / పుష్ప సినిమాతో( Pushpa Movie ) ర‌ష్మిక ను అంద‌రూ నేషనల్ క్రష్( National Crush ) చేసేశారు.

పుష్ప మూవీతో ర‌ష్మిక వ‌ర‌ల్డ్ వైడ్ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.ఎవ‌రైనా హీరోయిన్ న‌చ్చితే ఆమెను క్ర‌ష్ అనుకోవ‌డం మామూలే.

కానీ దేశం మొత్తంలో మెజారిటీ యూత్ కు ఒకే హీరోయిన్ ను క్ర‌ష్ అనుకోవ‌డంతో ర‌ష్మిక కు నేష‌న‌ల్ క్ర‌ష్ అనే ట్యాగ్ వ‌చ్చింది.

తాజాగా నేష‌న‌ల్ క్ర‌ష్ ట్యాగ్ పై ర‌ష్మిక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది.త‌న మొద‌టి సినిమా కిరాక్ పార్టీతోనే( Kirik Party Movie ) త‌న‌కు ఆ టైటిల్ స్టార్ట్ అయిన‌ట్టు ర‌ష్మిక వెల్ల‌డించింది.

కాలేజ్ మొత్తానికి తానే క్ర‌ష్ గా ఉండేదాన్నని చెప్పిన ర‌ష్మిక త‌ర్వాత క‌ర్ణాట‌క‌కు క్ర‌ష్ గా మారాన‌ని, ఆ త‌ర్వాత మెల్లిగా అది నేష‌న‌ల్ క్ర‌ష్ అయిపోయిన‌ట్టు తెలిపింది.

"""/" / ఇప్పుడు ఆడియ‌న్స్ త‌న ద‌గ్గ‌ర‌కొచ్చి దేశం మొత్తానికి నువ్వంటే చాలా ఇష్ట‌మని, అంద‌రి మ‌న‌సులో నువ్వున్నావని చెప్తున్న‌ప్పుడు ఆ ఫీలింగ్ చాలా స్పెష‌ల్ గా ఉంద‌ని ర‌ష్మిక చెప్పుకొచ్చింది.

అంతేకాదు, ఇప్పుడు తాను అంద‌రి జీవితాల్లో, అంద‌రి మ‌న‌సుల్లో భాగ‌మైన‌ట్టు ర‌ష్మిక వెల్ల‌డించింది.

ప్ర‌స్తుతం ఛావా( Chhaava ) ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న ర‌ష్మిక ఈ సినిమాలో న‌టించ‌డంపై ఆనందం వ్య‌క్తం చేసింది.

కాగా ఆమె కాలికి దెబ్బ తగిలినా కూడా సినిమా ప్రమోషన్స్ లో అంతే యాక్టివ్ గా పాల్గొంటుండటంతో ఆ విషయం పట్ల అభిమానులు సంతోషిస్తూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

కాగా ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఛావా సినిమాను శంభాజీ మ‌హారాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెరకెక్కింది.

ఈ సినిమాలో విక్కీ కౌశ‌ల్ శంభాజీగా న‌టించ‌గా, ఆయ‌న భార్య యేసుబాయ్ పాత్ర‌లో ర‌ష్మిక న‌టించింది.