రష్మిక మందన్నా పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు తగ్గింది
TeluguStop.com
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మరియు బాలీవుడ్ ఇలా అన్ని భాష సినీ పరిశ్రమ ల్లో ప్రస్తుతం సినిమా లు చేస్తున్న రష్మిక మందన కి నేషనల్ క్రష్ అని బిరుదు సరిగ్గా సెట్ అంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప సినిమా తర్వాత ఆమె స్థాయి అమాంతం పెరిగి పోయింది.బాలీవుడ్ లో ప్రస్తుతం మూడు నాలుగు సినిమా లు చేస్తున్న ఈ అమ్మడు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమా లు చేయలేక పోతుంది.
అందుకు కారణం ఆమె యొక్క అత్యాశే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప సినిమా విడుదలైన వెంటనే రష్మిక మందన తన పారితోషికాన్ని ఏకంగా మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలకు పెంచేసిందట.
దాంతో ఆమె తో సినిమా అంటేనే నమస్కారం పెట్టి పక్కకి వెళ్తున్నారు నిర్మాతలు.
ఆమె ను తమ సినిమాల్లో నటింపజేయడం కంటే ఒక చిన్న హీరోయిన్ నటింపజేసి ప్రశాంతం గా సినిమాను ముగించుకోవడం ఉత్తమం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.
భారీగా భారీతోషికం పెంచడం వల్ల ఇప్పుడు ఆమె కు కనీసం ఆఫర్లు రావడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
మళ్ళీ ఆమె తన పారితోషికాన్ని తగ్గించుకుని అందరికీ తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ టాక్ నడుస్తోంది.
"""/"/
పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఈ అమ్మడు వరుసగా తన పారితోషికాన్ని ఇప్పుడు మళ్ళీ ఆఫర్లు రాక పోవడంతో తగ్గించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ముందు ముందు రష్మిక మందన కి స్టార్ హీరోల్లో నటించే అవకాశం రావాలంటే ప్రస్తుతం ఎక్కువ సినిమాలకు కమిటీ అవ్వాలి.
అందుకే తన పారితోషికంని తగ్గించి మళ్ళీ బిజీ అవ్వాలని ఈ అమ్మడు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వెంకీ అట్లూరి ఇక తెలుగు హీరోలతో సినిమాలు చేయాడా..?