తగ్గించుకున్న రష్మిక మందాన.. దాంతో వరుసగా వస్తున్న ఆఫర్స్

చలో మరియు గీతా గోవిందం సినిమా లతో తెలుగు లో పాపులారిటీని చేసుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందాన ప్రస్తుతం తెలుగు లో పుష్ప 2 సినిమా మాత్రమే చేస్తుంది.

హిందీ లో ఈమె నటించిన సినిమా లు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.

తమిళం లో కూడా వరుసగా ఆఫర్స్ రావడం లేదు.అయినా కూడా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ డిమాండ్ చేసింది అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది.

తాజాగా ఈ అమ్మడు పారితోషికం విషయం లో వెనక్కు తగ్గినట్లుగా అనిపిస్తుంది.అందుకే రెమ్యూనరేషన్ తగ్గించగానే నితిన్ కు జోడి గా నటించే అవకాశం సొంతం చేసుకుందట.

వెంకీ కుడుముల దర్శకత్వం లో నితిన్ హీరో గా రూపొందబోతున్న సినిమా లో రష్మిక మందాన హీరోయిన్ గా ఎంపిక అయింది.

వీరి ముగ్గురి కాంబో లో గతం లో భీష్మ అనే సినిమా ను చేశారు.

"""/"/ ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరో సారి వీరి కాంబినేషన్ రిపీట్ కాబోతుంది.

భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకునే ఉద్దేశం తో నితిన్ హిట్ కాంబినేషన్ పునరావృతం చేయబోతున్నాడు.

నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే కచ్చితం గా నితిన్ సినిమా మేకర్స్ రష్మిక మందన ను వద్దనే వారే కానీ.

ఆమె తన పారితోషికాన్ని తగ్గించడం వల్లే నితిన్‌ కి జోడి గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

"""/"/ రష్మిక మందన తాజాగా కమిట్ అయిన సినిమా కు గాను రెండున్నర కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ సినిమా మరో హిట్ సినిమా గా నిలవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ధీమా తో ఉన్నారు.

మరి రష్మిక కి విజయం దక్కుతుందా అనేది చూడాలి.