మరో వివాదంలో నటి రష్మిక…. ఆ చిన్న తప్పే ఈమెను ఇంకా వెంటాడుతోందా?

నేషనల్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదంలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ముఖ్యంగా కన్నడ ప్రేక్షకుల నుంచి ఈమెకు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి.

నిజానికి రష్మిక కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కన్నడ చిత్రం కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమై మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం తెలుగు హిందీ భాష చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.

ఇలా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రష్మిక ఇటీవల కన్నడ సినిమాల గురించి కన్నడ భాష గురించి తక్కువ చేసి మాట్లాడటంతో కన్నడ ప్రేక్షకులు ఈమెను బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

"""/" / ఇదే విషయంలోనే తరచూ వివాదంలో నిలుస్తున్నారు అయితే తాజాగా మరో వివాదంలో నిలిచారు.

రిషబ్ శెట్టి (Rishabh Shetty)దర్శకత్వంలో రక్షిత్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా డైరెక్టర్ రిషబ్ శెట్టి నటుడిగా మారి కాంతారా (Kanthara)సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈ సినిమాలో తన నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

అప్పట్లో ఈ సినిమాపై చాలామంది ప్రశంసల కురిపించారు కానీ రష్మికను ఈ సినిమా గురించి అడగడంతో తాను ఇంకా సినిమా చూడలేదు అంటూ సమాధానం చెప్పారు.

"""/" / ఈ సమాధానం కన్నడ ప్రేక్షకులకు ఏమాత్రం జీర్ణించుకోలేనిదిగా మారింది.అయితే తాజాగా మరొక ఇంటర్వ్యూలో కాంతారా సినిమా గురించే తిరిగి ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ.ఇది పాత కథే.

కానీ, ఇప్పటికీ ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ లేవనెత్తడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు.

నా వ్యక్తిగత విషయాలు ప్రపంచానికి చెప్పలేను.కెమెరా ముందు ప్రొఫెషనల్‌గా ఉండటమే నాకు ముఖ్యమని తెలిపారు.

ఏ విషయమైనా నాకు వ్యక్తిగతంగా ఉండటమే ఇష్టం వాటిని బహిరంగంగా చర్చించడానికి తాను ఇష్టపడను అంటూ ఈమె తెలిపారు.

ఇలా ఈమె చేసిన వ్యాఖ్యలతో కన్నడ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రష్మిక సినిమాలను కన్నడ భాషలో బ్యాన్ చేయాలి అండ్ డిమాండ్ చేస్తున్నారు.