బైలింగ్వల్ ఛాన్స్ పట్టేసిన రష్మిక..!
TeluguStop.com

టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది.


ఇదే కాకుండా చరణ్ 15వ సినిమా శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కూడా రష్మిక మందనని హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిందని టాక్.


ఇదే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమాలో కూడా కన్నడ భామకు ఛాన్స్ దక్కిందని తెలుస్తుంది.
జాతిరత్నాలు సినిమాతో సత్తా చాటిన డైరక్టర్ అనుదీప్ కెవి తన నెక్స్ట్ సినిమా తమిళ హీరో శివ కార్తికేయన్ తో చేస్తున్నాడని తెలుస్తుంది.
"""/"/
ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు.సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ని సెలెక్ట్ చేసినట్టు టాక్.
ఆల్రెడీ కార్తీ సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఇక మీదట తమిళంలో కూడా వరుస సినిమాలు చేయాలని చూస్తుంది.
శివ కార్తికేయన్ జోడీగా రష్మిక బైలింగ్వల్ మూవీలో లక్కీ ఛాన్స్ అందుకుంది.రష్మిక ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ వచ్చింది.
మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. వరుస సినిమాలతో రష్మిక మాత్రం తన సత్తా చాటేందుకు సిద్ధం అయింది.
ఆ రీజన్ వల్లే సింపుల్ గా పెళ్లి చేసుకున్నాను.. రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ కామెంట్స్!