Rashmika Mandanna: ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం మత్తెక్కించే విధంగా ఫోజులు ఇచ్చిన రష్మిక.. ఆ అందాన్ని తట్టుకోలేమంటున్న ఫ్యాన్స్?
TeluguStop.com
టాలీవుడ్ హీరోయిన్,నేషనల్ క్రష్ రష్మిక మందన( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం తెలుగులో రెయిన్బో అనే లేడీ సెంట్రిక్ మూవీతో పాటుగా అల్లు అర్జున్‌తో పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాలో కూడా కూడా నటిస్తోంది.
ఇటీవలే వారసుడు మూవీతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం హిందీలో యానిమల్( Animal Movie ) అనే ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తోంది.
రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.
"""/" /
కాగా ప్రస్తుతం రష్మిక ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది.
తాజాగా కూడా రష్మికకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది.ఈ భామ శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న ఒక ఫ్యాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా నటించనుంది.
డి 51( D51 ) అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ నిర్మిస్తున్నారు.
ఈమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే.ఇక తాజాగా రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మొత్తంగా 38 మిలియన్ ఫాలోవర్లని దక్కించుకుని ఒక గొప్ప రికార్డు నమోదు చేసింది.
"""/" /
దీంతో ఇండియాలోనే అత్యధిక ఇంస్టాగ్రామ్ ఫాలోవర్లు( Instagram Followers ) కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా సెన్సేషనల్ రికార్డ్‌ను నమోదు చేసింది రష్మిక.
ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక ఎల్లే మ్యాగజైన్( Elle Magazine ) కోసం ఒక ఫోటో షూట్ చేసింది.
ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆ ఫోటోలను చూసిన రష్మిక అభిమానులు శ్రీవల్లి అందాలను తట్టుకోవడం మా వల్ల కాదు బాబోయ్ కొందరు కామెంట్స్ చేయగా, ఏమీ అందం రా బాబు అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ట్రోల్స్ ఎఫెక్ట్… డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నటి… షాకింగ్ విషయాలు రివీల్?