రష్మికా మందన్నా సిస్టర్ ను చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..?

స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు, కన్నడ భాషలతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ ఆఫర్లతో రష్మిక మందన్నా బిజీ అవుతుండటంతో తెలుగు, కన్నడ భాషలకు ఈమె గుడ్ బై చెబుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే రష్మికకు సిస్టర్ ఉందనే సంగతి చాలామంది అభిమానులకు తెలియదు.నిన్న రష్మిక మందన్నా క్యూట్ సిస్టర్ షిమాన్ మందన్నా పుట్టినరోజు కాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.

అదే సమయంలో రష్మిక షిమాన్ తో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ పోస్టుల ద్వారా రష్మిక తన చెల్లిపై ఉన్న ప్రేమను తెలియజేశారు.ప్రస్తుతం రష్మిక సినిమా షూటింగ్ కొరకు హైదరాబాద్ కే పరిమితమయ్యారు.

ఆ కారణం వల్ల చెల్లి పుట్టినరోజు వేడుకలకు రష్మిక హాజరయ్యారు.రష్మిక తన సిస్టర్ ను డార్లింగ్ బేబీ అంటూ సంబోధించడంతో పాటు చెల్లిని ఎప్పుడూ బాధ పెట్టనని సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఇంటికి చేరుకుంటానని రష్మిక చెప్పుకొచ్చారు.

హిందీలో అమితాబ్ మూవీతో బిజీగా ఉన్న రష్మిక మందన్నా తెలుగులో పుష్ప సినిమాతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు.

గతంలో షియాన్ మందన్నాతో దిగిన ఫోటోలను సైతం రష్మిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇప్పటికే వరుస విజయాలతో సినిమాసినిమాకు సక్సెస్ రేటును పెంచుకుంటున్న రష్మిక పుష్ప సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంటారని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పుష్ప సినిమా తెరకెక్కుతుండగా పుష్ప రిలీజ్ డేట్ డిసెంబర్ కు మారనుందని ప్రచారం జరుగుతోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే3, శుక్రవారం 2024