Rashmika Mandanna : మేము ప్రశ్నిస్తే ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు తెలీదా అంటూ మాట్లాడుతారు: రష్మిక

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రేటీలకు ఎంతో మంచి గుర్తింపు ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలోనే స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు చాలా గొప్పగా బ్రతుకుతూ ఉంటారని, సెలబ్రిటీలకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవని భావిస్తూ ఉంటారు.

అయితే వారు ఎంత సెలబ్రిటీలు అయినప్పటికీ వారికంటూ ఎన్నో సమస్యలు ఉంటాయి.అయితే ఇండస్ట్రీలో ఉండేవారికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉంటాయో అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తుంటాయనే సంగతి మనకు తెలిసిందే.

"""/" / ఇకపోతే ప్రస్తుత కాలంలో హీరోయిన్ల పరిస్థితి మరి దారుణంగా మారిపోతుంది .

అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించి ఎంతోమంది హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఎంతోమంది డీప్ ఫేక్ బారిన పడినటువంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఉన్నారు.ఇలా డీప్ ఫేక్ బారిన పడినటువంటి వారిలో రష్మిక మందన్న ( Rashmika Mandanna )కూడా ఒకరు తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"""/" / డీప్ ఫేక్( Deep Fake ) బారిన పడి ఈ విషయం గురించి ప్రశ్నిస్తే మమ్మల్ని తప్పుపడుతున్నారని ఈమె తెలియజేశారు.

ఇలాంటివన్నీ కూడా ఇండస్ట్రీలో ఉంటాయని తెలిసే మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు కదా అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారని రష్మిక తెలిపారు.

ఇలాంటి పరిస్థితి సాధారణ అమ్మాయిలకు ఎదురైతే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుందని ఇలాంటి వారందరిలో కూడా అవగాహన రావడం కోసమే తాము ఇలాంటి సంఘటనలపై మాట్లాడుతున్నాము అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆ ఒక్క తప్పే ఆయనకి సక్సెస్ లను ఇవ్వడం లేదా..?