Rashmika Mandanna : వాలెంటైన్స్ డే స్పెషల్ మిస్ అవుతున్నానంటూ బుంగమూతి పెట్టుకున్న రష్మిక?
TeluguStop.com
నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప( Pushpa ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది.
ఇలా నటిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రష్మిక బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె యానిమల్( Animal Movie ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇలా వరుస భాషా చిత్రాలలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రష్మిక చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
"""/" /
బుంగమూతి పెట్టుకొని ఉన్నటువంటి ఒక ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇక ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె చాలా గ్యాప్ వచ్చిందని చాలా రోజులుగా మిమ్మల్ని మిస్ అవుతున్నాను అంటూ అభిమానులతో చిట్ చాట్ చేశారు.
ఇటీవల కాలంలో తనకు కాస్త పని కూడా ఎక్కువైందని అందుకే అభిమానులకు టైం ఇవ్వలేకపోతున్నానని రష్మిక తెలిపారు.
"""/" /
ఇన్ని రోజులపాటు ఏం జరిగిందో నేను అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నానని తనతో షేర్ చేసుకోండి అంటూ ఈమె చెప్పుకు వచ్చారు.
ఇంకా వాలంటైన్స్ డే( Valentines Day ) ప్లాన్స్ కూడా నాకు చెప్పండి.
కామెంట్ల రూపంలో తెలుసుకుంటాను అంటూ ఈమె అభిమానులను అడిగారు.దీంతో ఒక నెటిజన్ రష్మికను ప్రశ్నిస్తూ.
ఈ వాలెంటైన్స్ డే కి మీరు ఏం ప్లాన్ చేశారు అంటూ రష్మికను ఫాలోవర్ ప్రశ్నించారు.
"""/" /
ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ పెద్దగా ప్లాన్స్ అయితే ఏమీ లేవు రొటీన్ వర్క్ అంటూ ఈమె స్మైలీ ఎమోజిస్ షేర్ చేశారు.
దీంతో మరికొందరు నెటిజన్స్ స్పందిస్తూ ఎలాంటి ప్లాన్స్ లేవు కానీ విజయ్ దేవరకొండతో( Vijay Devarakonda ) టైం స్పెండ్ చేస్తారు కదా అంటూ ఈ సందర్భంగా రష్మిక గురించి నేటిజన్స్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా వీరి గురించి వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే.
వార్2 మూవీకి ఆ ఫైట్ హైలెట్ కానుందా.. ఆ 15నిమిషాలు అభిమానులకు పూనకాలే!