డబుల్ ధమాకా.. ఒకేరోజు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్ హీరోయిన్లు…?
TeluguStop.com
సాధారణంగా ఒకే హీరోయిన్ నటించిన సినిమాలు వారం రోజుల గ్యాప్ తో రిలీజ్ కావడమే చాలా అరుదు అలాంటిది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్లు తమ రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.
వాళ్లు ఎవరో కాదు తమన్నా, రష్మిక మందన్న( Tamannaah , Rashmika Mandanna ).
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.లాస్ట్ స్టోరీస్ 2 సినిమాలో చాలా బోల్డ్ గా నటించి చెమటలు పట్టించింది.
తర్వాత జైలర్ సినిమాలో కావాలయ్యా పాటకి హాట్ స్టెప్పులు వేసి మతి పోగొట్టింది.
ఇప్పుడు వేదా, స్త్రీ 2( Veda, Stree 2 ) అనే రెండు హిందీ సినిమాల్లో, ఒడెలా 2 అనే ఒక తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తోంది.
స్త్రీ 2 సినిమాలో "ఆజ్ కి రాత్" పాటకు తమన్నా అదిరిపోయే స్టెప్పులు వేసింది.
అయితే ఈ ముద్దుగుమ్మ నటించిన యాక్షన్ డ్రామా ఫిలిం "వేదా", కామెడీ హారర్ ఫిలిం "స్త్రీ 2" రెండూ కూడా 2024, ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానున్నాయి.
ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రావడం చాలా అరుదు.
అందుకే ఒక రేర్ రికార్డు ఈ ముద్దుగుమ్మ క్రియేట్ చేయబోతుందని చెప్పుకోవచ్చు.స్త్రీ 2లో హీరోయిన్ మాత్రం శ్రద్ధా కపూర్( Shraddha Kapoor ) అని గమనించాలి.
తమన్నా ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ లో మాత్రమే రెచ్చిపోయింది.మిగతా సన్నివేశాలు ఆమె కనిపించదు.
మరి ఈ రెండిట్లో ఏ సినిమాని తమన్నా ఫ్యాన్స్ చూజ్ చేసుకుంటారో చూడాలి.
"""/" /
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఇలాంటి ఒక రేర్ రికార్డు క్రియేట్ నెలకొల్పనుంది.
కాకపోతే ఆమె డిసెంబర్ లో ఈ రికార్డును రిపీట్ చేయనుంది.రష్మిక పుష్ప: ది రూల్ ( Pushpa: The Rule )సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కతున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది.
ఇందులో రష్మిక శ్రీవల్లి పాత్ర పోషిస్తుంది.ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది చాలా ఆసక్తికరంగా మారింది.
రష్మిక పాన్ ఇండియా ఫ్యాన్స్ కంపల్సరిగా రిలీజ్ అయిన రోజునే పుష్ప 2 మూవీ చూసే అవకాశం ఎక్కువ.
"""/" /
అయితే ఈ ముద్దుగుమ్మ డిసెంబర్ 6వ తేదీనే మరో సినిమాతో కూడా ఫ్యాన్స్ ను ఆకర్షించనుంది.
ఆ సినిమా మరేదో కాదు విక్కీ కౌశల్ తో కలిసి చేస్తున్న "ఛావా"( Chava ).
ఈ హిస్టారికల్ డ్రామాలో యేసుబాయి భోన్సాలేగా రష్మిక అలరించనుంది.యానిమల్ సినిమా తర్వాత రష్మిక కి బాలీవుడ్ ఫ్యాన్స్ చాలా దగ్గరయ్యారు.
ఇక పుష్ప 2 కూడా బాలీవుడ్ లో రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో ప్రేక్షకులు ఏ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
బన్నీ ప్రచార యావే ప్రాణం తీసింది.. మానవ హక్కుల కమిషన్ కు బన్నీపై ఫిర్యాదు!