సినిమా ఓకే చేయాలంటే 2 కండీషన్లు తప్పని సరి అంటున్న రష్మిక..
TeluguStop.com
చాలా మంది హీరోయిన్లు కాస్త స్టార్ డమ్ రాగానే పూర్తిగా మారిపోతారు.ఓ రేంజిలో తమను తాము ఊహించుకుంటారు.
తమతో సినిమా చేయాలనుకునే దర్శకనిర్మాతలకు పలు కండీషన్లు పెడతారు.అయితే కొందరు వారిని సమర్థిస్తే.
మరికొందరు విమర్శిస్తారు.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారనే మాటలు కూడా వినిపిస్తాయి.
ప్రస్తుతం అలాంటి పొజిషన్లోనే ఉంది క్యూట్ బ్యూటీ రష్మిక మందాన.ప్రస్తుతం తను టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసిన ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలోనూ నటిస్తోంది.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి రష్మిక బంఫర్ హిట్ అందుకుంది.
నితిన్ తో జోడీ కట్టి భీష్మ సినిమాలోనూ అదరగొట్టింది.ఒకే ఏడాదిలో హిట్ సినిమాల్లో నటించి వారెవ్వా అనిపించింది.
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కాస్త సినిమాలకు విరామం ఇచ్చింది.సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది.
"""/"/
తాజా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది ఈ కన్నడ బ్యూటీ.
తను చేసే సినిమాల గురించి చెప్పింది.అంతేకాదు సినిమాల ఎంపికలో తను తీసుకుంటున్న జాగ్రత్తల గురించి చెప్పింది.
తాను సినిమాకు ఓకే చెప్పాలంటే ప్రధానంగా రెండు విషయాలను లెక్కలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
తన పాత్రలో ఎమోషన్ చాలా ఉండాలని చెప్పింది.అలాగే పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉండాలని చెప్పింది.
"""/"/ తన తొలి సినిమా కిరాక్ పార్టీ నుంచి ఇప్పటి వరకు సినిమాల విషయంలో ఇదే విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
అంతేకాదు సినిమాలోని తన రోల్ కీలకంగా ఉంటేనే చేస్తానని వెల్లడించింది.రెమ్యునరేషన్ కంటే తన పాత్రకే తాను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు చెప్పింది.
రష్మిక నిర్ణయాలు బాగానే ఉన్నాయని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.హీరోయిన్ గా రాణించాలి అంటే ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదు అని చెప్తున్నారు.
ఏ అమ్మాయికైనా అది చాలా బాధాకరం… విడాకులపై ఓపెన్ అయిన నిహారిక!