టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.
ఈ భామ ఇప్పుడు తెలుగులో పుష్ప సినిమాలో నటిస్తుంది.అలాగే శర్వానంద్ తో కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా లైన్ లో ఉంది.
వీటితో పాటు సురేందర్ రెడ్డి అఖిల్ సినిమా కోసం రష్మికని తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
అలాగే థాంక్యూ సినిమాలో నాగ చైతన్య కోసం ఈ భామని సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
వీటితో పాటు తమిళంలో కార్తీకి జతగా సుల్తాన్ అనే సినిమాలో నటించింది.ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.
వీటితో పాటు మాతృబాషలో పొగరు అనే సినిమాలో ధృవ్ సర్జాకి జోడీగా నటించింది.
ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇలా తెలుగు, కన్నడ, తమిళ బాషలలో స్టార్ హీరోయిన్ గా రష్మిక తన హవా కోనసాగిస్తుంది.
అయితే సౌత్ లో ఏ హీరోయిన్ ని రాని అదృష్టం ఇప్పుడు రష్మికకి వచ్చింది.
"""/"/
కెరియర్ ఆరంభంలోనే హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని ఈ అమ్మడు సొంతం చేసుకుంది.
సౌత్ లో క్రేజ్ ఉన్న నేపధ్యంలో బాలీవుడ్లో సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను అనే సినిమాకి ఒకే చెప్పేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.పుష్ప సినిమాలో తన సన్నివేశాలు ప్రస్తుతం లేకపోవడంతో ముంబై ఫ్లయిట్ ఎక్కేసి మిషన్ మజ్ను సినిమా షూటింగ్ లో జాయిన్ అయిపొయింది.
ఫస్ట్ షెడ్యూల్ అక్కడ పూర్తి చేసిన తర్వాత మరల పుష్ప కోసం హైదరాబాద్ వస్తుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే అమితాబచ్చన్ కూతురుగా రష్మిక మరో హిందీ సినిమాలో నటించబోతుంది.ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ఆరంభం అవుతుందని తెలుస్తుంది.