వరుణ్ తేజ్ బాక్సర్ కోసం రష్మికతో సంప్రదింపులు
TeluguStop.com
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ భామ రష్మిక మందనకి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది.
ఏకంగా నాలుగో సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశం సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం కమర్షియల్ హీరోయిన్ గా మారిపోయింది.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా ఇప్పుడు రష్మిక నటిస్తుంది.ఇక వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న ఈ అమ్మడుకి అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి.
పుష్ప సినిమాతో పాటు తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తుంది.అయితే ఇప్పుడు ఈ అమ్మడు కోసం కుర్ర హీరోలు పోటీ పడుతున్నారు.
మరో వైపు ఆచార్య సినిమాలో రామ్ చరణ్ జోడీగా రష్మికని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం కూడా రష్మికని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.
వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సర్ టైటిల్ తో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా కరోనా సిచువేషన్ కంటే ముందుగానే విశాఖలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
ఇందులో వరుణ్ తేజ్ కి జోడీగా బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ ని ముందుగా ఫైనల్ చేశారు.
అయితే ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో నభా నటేష్ ని ఫైనల్ చేసారని టాక్ వినిపిస్తుంది.
అయితే నభా కంటే రష్మిక బెస్ట్ ఛాయస్ అని చిత్ర యూనిట్ ఆమె కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే దర్శకుడు కిరణ్ రష్మికకి కథ కూడా చెప్పడం జరిగిందని, అయితే ఆమె డేట్స్ బట్టి చూసుకొని చెబుతానని అమ్మడు చిత్ర నిర్మాతలకి స్పష్టం చేసినట్లు సమాచారం.
ఆమె ఒకే అంటే అఫీషియల్ గా రష్మిక హీరోయిన్ అని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.
హ్యాపీగా రిటైర్ అవుతా…. అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన రష్మిక!