ఇది నాకు దక్కిన గౌరవం… సల్మాన్ తో నటనపై రష్మిక కామెంట్స్! 

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఒకవైపు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇటీవల ఈమె ఛావా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇక త్వరలోనే రష్మిక సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా నటించిన సికిందర్(Sikindar) సినిమాలో హీరోయిన్గా నటించారు ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

"""/" / రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈ సినిమా మార్చ్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రష్మిక సికిందర్ సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ.

సల్మాన్‌తో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.ఇంతకంటే పెద్ద విషయం ఏముంటుందని తెలిపారు.

ఈ సినిమాలో నటించడం నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. """/" / 8 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను.

మురుగదాస్‌ సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో కోరుకున్నాను.ఆయన రచనల్లో, సినిమాల్లో ప్రత్యేకత ఉంటుందని తెలిపారు.

ఈ సినిమా తెరపై చూడటం కోసం మీ అందరితో పాటు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.

ఈ సినిమా కోసం నిర్మాతలు నన్ను సంప్రదించినప్పుడు తాను ఆశ్చర్యపోయానని వెల్లడించారు.ఇందులో మరొక నటి కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే ఇక కాజల్ అగర్వాల్ తో కలిసి నటించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని భవిష్యత్తులో కూడా ఆమెతో నటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని రష్మిక తెలిపారు.