మీ అందరికీ తెలుసు కదా… పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి రష్మిక కామెంట్స్ వైరల్!

నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ( Rashmika ) ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఈమె నటించిన పుష్ప 2( Pushpa 2 ) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే చెన్నైలో జరిగిన పుష్ప ది రూల్ వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో రష్మిక తన పెళ్లి ( Marriage ) గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"""/" / రష్మిక నటుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తో ప్రేమలో ఉంది అంటూ గత కొంతకాలంగా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

అందుకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం ,వెకేషన్ వెళ్లడం, షాపింగ్ అలాగే ఒకే చోట కలిసి పండుగలను సెలెబ్రేట్ చేసుకోవడం వంటివి చూస్తుంటే త్వరలోనే వీరిద్దరూ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని కూడా అభిమానులు బావిస్తున్నారు.

అయితే ఈ శుభవార్తను రష్మిక నోటి గుండా వినాలని ఎంతో మంది అభిమానులు ఆరాటపడుతున్నారు.

ఈ క్రమంలోనే పుష్ 2 వేడుకలో ఈమెకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

"""/" / ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ రష్మికను ప్రశ్నిస్తూ మీరు ఇండస్ట్రీలో వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకుంటారా? లేదా? అని అడిగేసారు.

ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ.ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి తెలుసు కదా అంటూ సమాధానం చెప్పారు.

రిపోర్టర్స్ అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి ఎవరో మాకు చెబుతారా అంటూ ప్రశ్నించడంతో రష్మిక మాత్రం ఆ వ్యక్తి పేరు చెప్పకుండా వ్యక్తిగతంగా మనం ఎప్పుడైనా కలిసినప్పుడు ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం అంటూ ముగింపు పలికారు.

ఇలా రష్మిక ఆ వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు కదా అంటూ చెప్పడంతో కచ్చితంగా విజయ్ దేవరకొండ గురించే ఈమె చెప్పారని అభిమానులు భావిస్తున్నారు.

ఇదేందయ్యా ఇది: పెళ్లి కారును ఇలా కూడా డెకరాటే చేస్తారా? (వీడియో )