నా కారణంగానే బన్నీకి దెబ్బలు తగిలాయి… రష్మిక సంచలన వ్యాఖ్యలు!

రష్మిక( Rashmika ) అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప 2( Pushpa 2 ) .

ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పటివరకు ఈ సినిమా సుమారు 1700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని అల్లు అర్జున్ సరికొత్త రికార్డులను అందుకుంటున్నారు.

అదేవిధంగా మరోవైపు ఈయన వివాదంలో చిక్కుకొని జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి (Srivalli) పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.

"""/" / రష్మిక శ్రీవల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు ఈ పాత్ర ఆమె కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండి పోయే పాత్ర అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో భర్త మీద అమితమైన ప్రేమను చూపించే ఓ భార్య పాత్రలో రష్మిక అద్భుతంగా నటించారు.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్లలో పాల్గొన్న రష్మిక ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్నిసార్లు తాను భయాందోళనలకు గురి అయినట్లు రష్మిక ఇది వరకు వెల్లడించారు.

"""/" / ముఖ్యంగా పీలింగ్స్ సాంగ్ షూటింగ్ సమయంలో బన్నీ సార్ నన్ను అలా ఎత్తుకొని డాన్స్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా పైకి ఎత్తితే ఎక్కడి కింద పడేస్తారో అనే భయం నాలో ఉండేది ఆ భయం కారణంగానే కాస్త అభద్రత భావానికి గురి అయ్యానని తెలిపారు.

అదేవిధంగా ఈ పాట షూటింగ్ సమయంలో నా గాజు పగిలి బన్నీ సర్ చేతికి గాయమైందని ఆ గాయం కారణంగా ఆయనకు రక్తస్రావం జరుగుతున్నప్పటికీ షూటింగ్ పైనే ఫోకస్ చేశారని తెలిపారు.

ఇలా నా కారణంగా అల్లు అర్జున్ సర్ బాధపడ్డారు అంటూ తాజాగా రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పైనాపిల్ ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా ఒత్తుగా పెంచుతుంది.. ఎలా వాడాలంటే?