డియర్ కామ్రేడ్ డిజాస్టర్ అయిన రష్మికకి ఆ విధంగా గుర్తింపు

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయస్ట్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని వరుస హిట్ లతో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.

టాలీవుడ్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలని ఈ అమ్మడు చేస్తుంది.

వీటితో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.ఇదిలా ఉంటే బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న ఈ అమ్మడుకి కెరియర్ లో గుర్తుండిపోయే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అవార్డుని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో మిషన్ మజ్ను సినిమాతో పాటు అమితాబచ్చన్ కూతురుగా రెండు సినిమాలు ఒకే చెప్పింది.

కొత్త ఏడాదిలో రష్మిక కెరియర్ పరంగా మంచి స్పీడ్ లో ఉంది.ఇప్పుడు తన కెరియర్ లో డిజాస్టర్ మూవీగా నిలిచినా డియర్ కామ్రేడ్ సినిమా ఈ భామకి అవార్డుని తీసుకొచ్చి పెట్టింది.

కేంద్ర ప్రభుత్వం భాషల వారీగా ప్రతి ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు ప్రధానం చేస్తున్నారు.

అన్ని విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు ఇవ్వనున్నారు.2019కి గాను తెలుగులో ఉత్తమ నటి కేటగిరీలో డియర్ కామ్రేడ్ సినిమాకి రష్మిక మందన అవార్డు సొంతం చేసుకుంది.

సినిమా రంగంలో ఉన్న నటీనటులకి అవార్డుల వారి పెర్ఫార్మెన్స్ కి నిదర్శనం.అలాంటి అవార్డుని ఇప్పుడు డియర్ కామ్రేడ్ ద్వారా రష్మిక సొంతం చేసుకోవడం ఆమె ఆనందానికి అవధులు లేవు.

సినిమా డిజాస్టర్ అయినా అందులో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి.కరణ్ జోహార్ అయితే ఆమెని లీడ్ గా పెట్టుకొని డియర్ కామ్రేడ్ కథలో కొద్దిగా మార్పులు చేసి హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నారు.

అయితే రష్మిక దానికి అంగీకరించలేదు.ఏదిఏమైనా ఒక ఫ్లాప్ మూవీ ద్వారా రష్మికకి ఉత్తమనటి అవార్డు రావడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. !