మూడు చోట్ల ఫ్యాక్చర్ అయింది… మీ ప్రేమకు రుణపడి ఉంటా: రష్మిక

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రష్మిక ( Rashmika ) ఒకరు.

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తెలుగులో అవకాశాలను అందుకున్నారు.

ఇలా వరుస తెలుగు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె పుష్ప( Pushpa ) సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా తర్వాత ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. """/" / ఇలా వరుస బాలీవుడ్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారు.

ఇక త్వరలోనే మరో బాలీవుడ్ చిత్రం చావా ( Chhaava ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక త్వరలోనే చావా అనే సినిమా ద్వారా రాబోతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా తన హెల్త్ అప్డేట్ తెలియజేశారు.

"""/" / నిజానికి రష్మికకు కాలు ఫ్రాక్చర్( Rashmika Leg Fracture ) కావడంతో ఎంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.

ఎక్కడికి వెళ్ళినా ఒంటి కాలిపైనే వెళుతూ ఉన్నారు.తాజాగా తన హెల్త్ గురించి రష్మిక మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.

తన కాలికి మూడు చోట్ల ఫ్యాక్చర్ అయిందని ఈమె వెల్లడించారు.కండరాలలో కూడా చీలికలు వచ్చినట్టు తెలిపారు.

గత రెండు వారాలుగా కనీసం నడవలేకపోతున్నానని ఎక్కడికి వెళ్లిన ఒంటి కాలిపైనే వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.

నాపై మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానంతో నాకు నొప్పి తెలియడం లేదు.ఇలాంటి సమయంలో నాకు మద్దతుగా నిలిచిన మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా అంటూ రష్మిక పోస్ట్ చేశారు.