పుష్ప 2లో తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన శ్రీవల్లి?

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఈ సినిమాతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

ఇక ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం రాబోతుందని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా పూజ కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.ఇక ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పుష్పరాజ్ ఇజ్ బ్యాక్ అంటూ ఒక పోస్ట్ చేశారు.

అలాగే భారతదేశం ఎక్కువగా ఎదురుచూస్తున్న సిక్వెల్ మరింత గొప్పగా ఉండబోతుంది.అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ విధంగా రష్మిక చేసిన పోస్ట్ పై ఓ అభిమాని స్పందిస్తూ పుష్ప ది రూల్.

ఇందులో రష్మిక పాత్ర మరింత బలంగా ప్రకాశవంతంగా ఉండేలా చేయండి. """/" / పార్ట్ 2లో ధనంజయ్ కార్యెక్టరైజేషన్ కోసం చాలా ఆసక్తిగా ఉన్నాము అంటూ రాసుకొచ్చాడు.

ఈ విధంగా నేటిజన్ చేసిన కామెంట్స్ స్పందించిన రష్మిక అలాగే మనం కూడా చూద్దాం అంటూ ఒక ఎమోజిని షేర్ చేశారు.

దీన్ని బట్టి చూస్తే పుష్ప ది రూల్ సినిమాలో రష్మిక పాత్ర మరింత కీలకంగా ఉండబోతుందని అర్థమవుతుంది.

ఇకపోతే తాజాగా జరిగిన పూజ కార్యక్రమాలలో భాగంగా అల్లు అర్జున్ న్యూయార్క్ పర్యటనలో ఉండటం వల్ల ఈ పూజా కార్యక్రమాలుకు హాజరు కాలేకపోయారు.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు…