పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటేందుకు నేషనల్ క్రష్ ప్లాన్..?

ఈరోజుల్లో హీరోయిన్లు మొదటి సినిమాలతో వచ్చిన ఫేమ్ ను కాపాడుకుంటున్నారు.ఆ ఫేమ్ తోనే బడా హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్స్ దక్కించుకుంటున్నారు.

చాలా జాగ్రత్తగా, చక చకా నిర్ణయాలు తీసుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగిస్తున్నారు.

అలాంటి వారిలో రష్మిక మందన్న( Rashmika Mandanna ) ఒకరు.ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా సినిమాలకు వరుసగా సైన్ చేసుకుంటూ వెళ్ళిపోతోంది.

యానిమల్ మూవీ( Animal ) తర్వాత వచ్చిన ఫేమ్ బాగా ఉపయోగించుకుంటోంది. """/" / పుష్ప పార్ట్ 2లో( Pushpa 2 ) శ్రీవల్లి క్యారెక్టర్ కూడా చాలా ఫాస్ట్‌గా కంప్లీట్‌ చేయాలని ఈ ముద్దుగుమ్మ భావిస్తోంది.

అలా చేస్తేనే ఆమె "వ్యాంపైర్స్‌ ఆఫ్ విజయనగర్" షెడ్యూల్ ని రీచ్ అవ్వగలుగుతుంది.

అక్టోబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.అక్టోబర్ థర్డ్ వీక్ లో రష్మిక ఆయుష్మాన్‌ ఖురానా స్టారర్ మూవీ "వ్యాంపైర్స్‌ ఆఫ్ విజయనగర్"( Vampires Of Vijay Nagar ) షూట్‌లో పాల్గొంటుంది.

హంపి బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీగా "వ్యాంపైర్స్‌ ఆఫ్ విజయనగర్" సినిమా వస్తుంది.

స్త్రీ 2, భేడియా, ముంజ్య వంటి దెయ్యాల సినిమాల వలె ఈ మూవీ కూడా మెప్పిస్తుందని నమ్ముతున్నారు.

ఈ మూవీలో రష్మిక క్యారెక్టర్ లో చాలా షేడ్స్ కూడా ఉంటాయని అంటున్నారు.

మరి ఈ హిందీ మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. """/" / ఈ సంవత్సరం ఇప్పటికే ముంజ్యాతో హిట్ అందించిన ఆదిత్య సర్పోత్దార్ దీనికి డైరెక్షన్ అందిస్తున్నాడు.

ఈ మూవీని రెండు విభిన్న కాలాల్లో తీయనున్నారు.ఫస్ట్ బ్యాక్ డ్రాప్ నేటి యుగంలో ఒక చిన్న ఉత్తర భారత పట్టణం ప్రధాన ప్రదేశంగా ఉంటుంది.

రెండవ కాలం పురాతన నగరమైన విజయనగరం.సౌత్, నార్త్ రెండు ఇండస్ట్రీలను రష్మిక చాలా బాగా మేనేజ్ చేస్తోంది.

ప్రస్తుతం రెయిన్బో, ది గర్ల్‌ఫ్రెండ్ వంటి రెండు తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.

ఛావా, సికందర్ వంటి రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది.మల్టీ లాంగ్వేజ్ మూవీ "కుబేర" సినిమాలో కూడా ఈ తార కనిపించనుంది.

ఈ విధంగా చూసుకుంటే ఈ అమ్మడు ఒకేసారి రెండు తెలుగు, ఒక తమిళం, మూడు హిందీ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.

అవన్నీ కూడా ఆమెకు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చే సినిమాలే కావడం విశేషం.

ఇందులో కనీసం 3-4 సినిమాలు హిట్ అయినా రష్మికకు తిరుగుండదు అని చెప్పుకోవచ్చు.

జ్ఞాపకశక్తిని పెంచే ఈ పోషకాలను మీరు తీసుకుంటున్నారా.. లేదా..?