Venkatesh : వెంకటేష్ వల్లే తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చిన రష్మిక.. ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

గీత గోవిందం( Geetha Govindam ) డియర్ కామ్రేడ్, ఛలో, పుష్ప వంటి సినిమాలతో హాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎదిగింది రష్మిక మందన్న.

ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్,బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలను కూడా దున్నేస్తోంది.తాజాగా ఈ అందాల తార ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నది.

ఈ ఇంటర్వ్యూలో తాను తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణం విక్టరీ వెంకటేష్ ( Venkatesh )అని చెప్పి ఆశ్చర్యపరిచింది.

"""/" / రష్మిక మందన్న ( Rashmika Mandanna )ఇంటర్వ్యూలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముద్దుగుమ్మ ప్రీ-యూనివర్శిటీ కోర్సు లేదా ఇంటర్మీడియట్ లెవెల్ ఎడ్యుకేషన్‌ పూర్తి చేసిన తర్వాత డిగ్రీ కోసం బెంగళూరు సిటీకి వచ్చింది.

కొత్త అవకాశాల కోసమే కూర్గ్ నుంచి బెంగళూరు సిటీకి వచ్చినట్లు తెలిపింది.M.

S.రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో ఈ నేషనల్ క్రష్ సైకాలజీ డిగ్రీ కోర్సులో జాయిన్ అయింది.

అయితే ఆ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒకరోజు కాలేజీ యాజమాన్యం 'ఫ్రెష్ ఫేస్ ఆఫ్ 2014 బెంగళూరు' అనే కాంపిటీషన్ పెట్టింది.

ఈ పోటీకి ఒక టీచర్ రష్మికకు తెలియకుండానే ఆమె పేరును ఇచ్చారు.ఆ సమయంలో రష్మికకు చాలా బిడియం ఉండేది.

అందుకే 'ఎందుకు నా పేరు ఇచ్చారు? " అంటూ ఆమె కాస్త భయంగా ఫీల్ అయిందట.

అయితే టీచర్ "నీకు టాలెంట్ ఉంది, యు కెన్ గో ఫర్ ఇట్" అని ధైర్యం చెప్పారట.

ఈ కాంపిటీషన్‌లో పాటిస్పేట్ చేసి మొదటగా కాలేజీ లెవెల్, ఆ తర్వాత సెమీఫైనల్స్‌లో బెంగళూరు లెవల్లో రష్మిక గెలిచింది.

అనంతరం నేషనల్ ఫైనల్‌లో పాటిస్పేట్ చేసేందుకు ముంబై వెళ్ళింది.అక్కడ అక్షయ్ కుమార్, రానా దగ్గుపాటి రష్మికను ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా 2014గా సెలెక్ట్ చేశారు.

అలా ఈ ముద్దుగుమ్మ అనుకోకుండా ఈ కాంపిటీషన్ గెలుచుకుంది. """/" / తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియా టీమ్ కాలేజీకి వచ్చి రష్మిక ఫోన్ నంబర్ తీసుకుంది.

అలా న్యూస్ మీడియా నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా, ఆపై కన్నడ సినీ ఇండస్ట్రీలో రష్మిక గురించి తెలిసింది.

ఏడాది కాలంలోనే రక్షిత్‌ శెట్టి హీరోగా చేస్తున్న కిరాక్ పార్టీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది.

ఈ మూవీలో సూపర్ హిట్ సాంగ్ అయిన బెలగేడు ( Belageddu ) పాటలో వెంకటేష్ రష్మికను చూసి ఆమె బాగుందని అనుకున్నాడు.

నాగశౌర్య కూడా సేమ్ అదే ఫీలయ్యాడు.వీరిద్దరూ కలిసి అమ్మాయి బాగుందని ఒకరికొకరు చెప్పుకున్నారు.

చివరికి ఆమెను వెంకటేష్ కాంటాక్ట్ అయ్యాడు.మొదట్లో టాలీవుడ్ లాంటి బిగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి రష్మిక భయపడిందంట.

తరువాత తండ్రి ధైర్యం చెప్పడంతో ఈ తార ఛలో సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

/p.

వీడియో వైరల్: నొప్పి లేకుండా రక్తం తీయడం ఇకపై సులభంగా.. ఆనంద్ మహీంద్రా ట్వీట్..