మాజీ ప్రియుడు పై క్యూట్ కామెంట్స్ చేసిన రష్మిక.. ఏమన్నారంటే?

సినిమా ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా ఎంతోపేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అడుగుపెట్టిన రష్మిక అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకుంది.

పుష్ప సినిమా ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమెకు వరుస హిందీ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఇలా వరుస బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక హిందీలో ఈమె నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7వ తేదీ విడుదల కానుంది.

ఇది ఈమె డెబ్యూ మూవీ కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మికకు తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.

కెరియర్ మొదట్లో రష్మిక నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరుపుకొని బ్రేకప్ చెప్పుకున్న విషయం మనకు తెలిసింది.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన గురించి ఈమెకు ప్రశ్నలు ఎదురవడంతో రష్మిక షాకింగ్ కామెంట్స్ చేశారు.

"""/" / ఈ సందర్భంగా ఈమె సమాధానం చెబుతూ నా మాజీ బాయ్ ఫ్రెండ్ ను తాను ఇప్పటికీ ఎంతో మంచి స్నేహితుడు గానే భావిస్తున్నాను.

ప్రస్తుతం తాను వారి ఫ్యామిలీని వారి పార్ట్నర్స్ కలవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ఈ సందర్భంగా ఈమె సమాధానం చెప్పారు.

అదేవిధంగా నటుడు విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్ పై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

మీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలపై మీరు ఎలా స్పందిస్తారు అంటూ రష్మికకు విలేకరుల నుంచి ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ.వినడానికి చాలా క్యూట్ గా ఉందంటూ ఈమె చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది.

తోలు మందమైంది.. గిచ్చినా తెలియడం లేదు..: మంత్రి పొన్నం