ఆ డాన్స్ చేయడానికి కొన్ని గంటలు కష్టపడ్డాను… పుష్ప 2 పై రష్మిక కామెంట్స్ వైరల్!
TeluguStop.com
నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో పాటు ఇతర పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న రష్మిక ఇటీవల ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పుష్ప 2 సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
"""/" /
పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మిక తన నటన, డాన్సులతో ప్రేక్షకులను మెప్పించారు.
ఇక పుష్ప 2 నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.
ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా భారీ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో పాటలు గురించి రష్మిక పలు ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు.
"""/" /
ఇందులో ఒక పాట కోసం తాను కొన్ని గంటల పాటు కష్టపడ్డాను అని ఈమె తెలిపారు.
ఒక పాటలో భాగంగా కెమెరా లెన్స్ ముందు హాండ్స్ తో మూమెంట్ చేసే ఒక స్టెప్ ఉంది.
ఇది ఎన్ని సార్లు చేసినా రాలేదు ఈ స్టెప్ కోసం కొన్ని గంటలు కష్టపడ్డారని చాలా టేక్స్ కూడా తీసుకున్నానని తెలిపారు.
సుకుమార్ ( Sukumar ) గారు ప్రతి ఒక్క విషయంలోనూ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు.
అందుకే చాలా కష్టపడినట్లు వెల్లడించారు.ఇక పుష్ప సినిమాతో పోలిస్తే పుష్ప 2 సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ ఈమె కామెంట్లు చేయడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 6 కు వాయిదా పడింది.
కాంగ్రెస్ లో కొండా సురేఖ ఒంటరయ్యారా ?