విజయ్ దేవరకొండకు రష్మిక బ్రేకప్ చెప్పిందంటూ ప్రచారం.. ఆ హీరో వల్లేనా?
TeluguStop.com
రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమ పక్షులని వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలామంది భావిస్తారు.
అయితే అటు రష్మిక ( Rashmika ) కానీ ఇటు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కానీ చాలా సందర్భాల్లో తమ మధ్య ప్రేమ లేదని తాము మంచి స్నేహితులమని వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
అయితే విజయ్ దేవరకొండకు రష్మిక బ్రేకప్ చెప్పిందంటూ ప్రచారం జరుగుతోంది.బాలీవుడ్ మీడియా వర్గాల్లో ఈ మేరకు కథనాలు ప్రచారంలోకి వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
విజయ్ దేవరకొండ థమ్స్ అప్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా రష్మిక మరో కూల్ డ్రింక్ బ్రాండ్ కోసం పని చేస్తుండటం వల్ల ఈ వార్త ప్రచారంలోకి వచ్చిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే విజయ్ కు దూరమైన రష్మిక బెల్లంకొండ శ్రీనివాస్ కు( Bellamkonda Srinivas ) దగ్గరైందని వార్తలు వినిపిస్తున్నాయి.
"""/" /
ఈ మధ్య కాలంలో రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్ పలు సందర్భాల్లో కలిసి కనిపించడంతో ఈ వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.
వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైందని ప్రచారం జరుగుతోంది.వైరల్ అవుతున్న వార్తల గురించి రష్మిక లేదా బెల్లంకొండ శ్రీనివాస్ లలో ఎవరో ఒకరి నుంచి స్పందన వస్తుందేమో చూడాల్సి ఉంది.
కొంతమంది నెటిజన్లు మాత్రం వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని చెబుతున్నారు. """/" /
రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్, రష్మిక రాబోయే రోజుల్లో సినిమాలలో కలిసి నటిస్తారేమో చూడాల్సి ఉంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఎప్పటికీ అనుబంధం చెరిగిపోదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్‌పై ఎన్ఆర్ఐల ఆశలు .. పన్ను చెల్లింపులపై భారత ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు