ఆక్రమించుకోవడం ఏంటి.. ఆమేమైనా చిన్నపిల్లనా.. అనసూయ పై రష్మీ కామెంట్స్!

బుల్లితెర యాంకర్లుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో అనసూయ( Anasuya ) రష్మీ( Rashmi ) పేర్లు ముందు వరుసలో ఉంటాయి.

వీరిద్దరూ జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించారు.జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకోగా రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగారు.

అయితే జబర్దస్త్ కార్యక్రమానికి ముందుగా అనసూయ యాంకర్ గా వ్యవహరించగా అనంతరం కొన్ని కారణాలవల్ల రష్మీ యాంకర్ గా వచ్చారు.

"""/" / ఇలా రష్మీ యాంకర్ గా రావడంతో చాలామంది ఈమెపై విమర్శలు చేశారు.

ఉద్దేశపూర్వకంగానే అనసూయను తప్పించి రష్మీ వచ్చారని రష్మీ పట్ల చాలా ట్రోల్స్ వచ్చాయి అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మికి ఈ సంఘటన గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

అప్పట్లో నాకు సంబంధం లేని విషయం మీద నన్ను ట్రోల్ ( Trolls ) చేశారు.

ఏం జరుగుతుందో కూడా అర్థం కాకపోవడంతో సైలెంట్ గా ఉన్నా, నన్ను అప్పట్లో దారుణంగా తిట్టారని ఆమె చెప్పుకొచ్చింది.

అనసూయ ప్లేస్ మీరు ఎందుకు ఆక్రమించారనే ప్రశ్న ఈమెకు ఎదురయింది. """/" / ఈ ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ.

ఆక్రమించుకోవడం ఏంటి లాగేసుకున్నానంటూ సమాధానం ఇచ్చింది.మరోసారి యాంకర్ అనసూయ పక్కకి పంపి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే అనసూయ చిన్నపిల్లా ఏంటి? పక్కకు పంపడానికి అంటూ రష్మీ సమాధానం ఇచ్చింది.

అయితే ఈ విషయం గురించి రష్మీ ఇలాంటి కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది కానీ అనసూయను పక్కకు పంపి రష్మీ ఆ స్థానానికి రాలేదని అనసూయ తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు బ్రేక్ ఇవ్వడంతోనే ఆ కార్యక్రమానికి యాంకర్ గా రష్మీ వ్యవహరించారని తెలుస్తోంది.

మీ అభిమానం చల్లగుండ.. ఒకే పోస్టర్ లో ఇన్ని వెరియేషన్స్!