చరిత్రలో తొలిసారి: ఆక్స్‌ఫర్డ్ స్టూడెండ్ యూనియన్ హెడ్‌గా భారతీయ యువతి
TeluguStop.com
యూకేలో భారతీయ విద్యార్ధిని చరిత్ర సృష్టించింది.ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా రష్మీ సమంత్ ఎన్నికయ్యారు.
తద్వారా ఈ పదవికి ఎన్నికైన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డుల్లకెక్కారు.ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అనుబంధ లినాక్రే కాలేజీలో ఎనర్జీ సిస్టమ్స్‌లో రష్మీ ఎంఎస్సీ చదువుతున్నారు.
గురువారం జరిగిన యూనవర్సిటీ స్టూడెండ్ యూనియన్ లీడర్‌షిప్ ఎన్నికల్లో ఆమె 1,966 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
రష్మీ.కర్ణాటకలోని ప్రఖ్యాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్ధిని.
‘‘ ప్రపంచంలో క్షీణిస్తున్న వాతావరణాన్ని దారిలో పెట్టడానికి సమర్థవంతమైన విధాన రూపకల్పన, శక్తి సమానత్వాన్ని విశ్వసించే స్థిరమైన ఇంధన ఔత్సాహికురాలు’’ అని ఆమె తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో రాసుకున్నారు.
దీనిని బట్టి ప్రకృతి, పర్యావరణం పట్ల రష్మీకి వున్న ఆసక్తిని అర్ధం చేసుకోవచ్చు.
సంస్థాగతంగా వేళ్లూనుకున్న హోమోఫోబియా, ట్రాన్స్‌ఫొబియాను తరిమికొట్టడం, క్రిటోఫర్ కోడ్రింగ్టన్ సహా సామ్రాజ్యవాదిగా పేర్కొన్న వారి విగ్రహాలను తొలగిస్తానని ఆమె తన మేనిఫెస్టోలో తెలిపారు.
నాణ్యతతో కూడిన మానసిక వనరులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గ్రూప్ కౌన్సెలింగ్‌ను విస్తరించడం, కౌన్సిలర్ల నియామక సమయంలో వైవిధ్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తానని రష్మీ సమంత్ చెప్పారు.
ఇక స్టూడెంట్ యూనియన్‌లోని కీలక పదవుల్లో భారతీయులే ఎన్నిక కావడం విశేషం.వైస్ ప్రెసిడెంట్ గ్రాడ్యుయేట్స్- ఎలెక్ట్‌గా దేవికా, స్టూడెంట్ ట్రస్టీలుగా ధీటీ గోయెల్ వున్నారు.
"""/"/
కాగా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో విద్యార్ధులకు ఒక బలమైన గొంతుకగా వుండాలనే ఉద్దేశ్యంతో 1961లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ రిప్రజేంటెటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.
అలాగే తమకు అధికారిక గుర్తింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ విద్యార్ధులు ఆందోళణ నిర్వహించారు.
వీరి ప్రయత్నాలు ఫలించి ఆ కౌన్సిల్‌ను 1970లో యూకే ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.
అనంతరం 1974లో సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని.ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్‌గా మారింది.
ప్రస్తుతం ఈ యూనియన్‌లో 21,000 మందికి పైగా సభ్యత్వం వుంది.
ఎన్టీఆర్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీకి నేను పెద్ద ఫ్యాన్.. వెంకటేశ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!