సోషల్ మీడియా గుడ్ బై చెప్పనున్న రష్మిక మందన?
TeluguStop.com
టాలీవుడ్ కన్నడ బ్యూటీ రష్మిక మందన.ఇటీవలే మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా ఎంపికైన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లిస్టులో ఉంది.
రోజురోజుకు మరింత క్రేజ్ పెంచుకుంటుంది రష్మిక.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ ను అందుకుంది.
ఇక సోషల్ మీడియా లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను, పోస్టులను బాగా షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పనుందట ఈ బ్యూటీ.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు అసలు కారణం ఉందట.
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ తో ఎంతలా ఇబ్బందులు ఎదుర్కొంటుందో కళ్ళారా చూస్తూనే ఉన్నాం.
చాలామంది ప్రజలు ఈ సమయంలో ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అంతేకాకుండా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.
"""/"/
ఇక రష్మిక సోషల్ మీడియా వేదికగా పలు జాగ్రత్తలు తెలుపుతూనే ఉంది.
కాగా తనకు సెకండ్ మొదలయ్యే కంటే ముందు తన టీం, తను బాగా అర్థం చేసుకుందట.
ఇది ఇంత వినాశకరమైనదని తమకు తెలియదట.ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఎంతో బాధను కలిగిస్తుందని.
దాంతో తన మానసిక శాంతి కోసం సోషల్ మీడియాను విడిచిపెట్టాలని అనుకున్నదట.కానీ అలా చేయలేనని తెలిపింది.
ఈ సమయంలో సామాన్య ప్రజలకు సహాయం చేస్తున్న వారిలో వెలుగు నింపాలని కోరుకోవడమే కాకుండా దానికి 'spreading Hope' ను ప్రారంభించానని రష్మిక తెలిపింది.
మొత్తానికి తాను తీసుకున్న నిర్ణయం అభిమానులను బాగా ఆకట్టుకుంది.ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పుష్ప లో హీరోయిన్ గా నటిస్తుంది.
బాలీవుడ్ లో గుడ్ బై, మిషన్ మజ్ను అనే వరుస సినిమాలలో నటిస్తుంది.
అంతేకాకుండా మరిన్ని అవకాశాలు అందుకునట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ట్రంప్‌ను తొలగించండి.. రోడ్డెక్కిన వేలాది మంది అమెరికన్లు