సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే: రష్మీ
TeluguStop.com
బుల్లితెర జోడీల్లో రష్మీ సుధీర్ జంటకు ఉన్న క్రేజే వేరు.జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ, సుధీర్ ఒకరినొకరు ప్రేమించుకున్నారంటూ, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.
సుడిగాలి సుధీర్, రష్మీ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఇంటర్వ్యూల్లో స్పష్టం చేసినప్పటికీ జబర్దస్త్, ఢీ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ లలో వాళ్ల మధ్య కెమిస్ట్రీని చూసిన ప్రేక్షకులు ఆ మాటలు నమ్మడం లేదు.
ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా రష్మీ, సుధీర్ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ అనుష్క గురించి ఎన్ని వార్తలు వైరల్ అయ్యాయో టీవీ రంగంలో సుధీర్ రష్మీ జోడీ గురించి అదే స్థాయిలో వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా రష్మీ ఫన్నీగా తాను ఎందుకు సుధీర్ ను పెళ్లి చేసుకోవడం లేదో చెప్పకనే చెప్పేసింది.
సుధీర్ ను పెళ్లి చేసుకుంటే తనకు ఎదురయ్యే సమస్యల గురించి ఫన్నీగానే వెల్లడించింది.
ఢీ షోలో సుధీర్ రష్మీ మధ్య పెళ్లి గురించి సంభాషణ జరిగింది.సుధీర్ రష్మీని పెళ్లి చేసుకోమని చెప్పగా తాను పెళ్లి చేసుకుంటే సుధీర్ బ్రతుకు పావురాలు, కర్ఛీఫ్ లతో మ్యాజిక్ షోలు చేసుకోవాలని చెప్పింది.
సుధీర్ ఆ తరువాత అలా కాదు మనిద్దరం పెళ్లి చేసుకుందామంటూ రష్మీతో అన్నాడు.
రష్మీ వెంటనే మనిద్దరం కలిసి మ్యాజిక్ షోలు చేసుకోవాలంటూ సుధీర్ కు పంచ్ వేసింది.
రష్మీ గౌతమ్ పరోక్షంగా పెళ్లి చేసుకుంటే అవకాశాలు తగ్గిపోతాయని చెప్పింది.నిజానికి సినిమా రంగంలో కానీ, టీవీ రంగంలో పెళ్లి తరువాత కెరీర్ లో సక్సెస్ అయిన వాళ్లు తక్కువ.
హీరోలకు, మేల్ యాంకర్లకు ఈ విషయంలో కొన్ని మినహాయింపులు ఉన్నా హీరోయిన్లు, లేడీ యాంకర్లు పెళ్లి తరువాత సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించడం అంత తేలిక కాదు.
అందువల్లే రష్మీ పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తొంది.
తలనొప్పిగా ఉన్నప్పుడు అస్సలు చేయకూడని తప్పులు ఇవే!