Rashmi Gautham : యాంకర్ రష్మీ సీరియల్స్ లో కూడా నటించారని తెలుసా.. ఏ సీరియల్స్ అంటే?

బుల్లితెరపై యాంకర్లుగా ఎంతోమంది సెలబ్రిటీల కొనసాగుతున్నారు.టాలీవుడ్ యాంకర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో రష్మీ గౌతమ్( Rashmi Gautham ) ఒకరు.

ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.

ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ ( Sudigali Sudheer )కొనసాగుతున్న సమయంలో ఈమె సుధీర్ తో చేసినటువంటి రొమాన్స్ కారణంగా ఈమెకు విపరీతమైనటువంటి పాపులారిటీ వచ్చింది.

అప్పటినుంచి ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇప్పటికీ వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడ చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఈ వార్తలను ఎప్పటికప్పుడు వీరు ఖండిస్తూనే ఉన్నారు.

"""/" / ఇలా బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్నటువంటి రష్మీ గతంలో హీరోయిన్గా వెండి తెరపై సినిమాలలో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈమె పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మరికొన్ని సినిమాలలో హీరోయిన్గా బోల్డ్ పాత్రలలో నటించారు.

ఇలా ఈమె వెండితెరపై భారీ స్థాయిలో రొమాన్స్ చేసిన అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు.

ఇలా వెండితెరపై సక్సెస్ కానటువంటి రష్మీ తిరిగి బుల్లితెరపైకి వచ్చారు.ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఈమె ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.

"""/" / ఇదిలా ఉండగా తాజాగా రష్మీకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈమె బుల్లితెరపై యాంకర్ గా మాత్రమే కాకుండా బుల్లితెర నటిగా కూడా పలు సీరియల్స్ చేశారు అంటూ తాజాగా ఈ వార్త వైరల్ అవుతుంది.

ప్రస్తుతం ఈటీవీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మీ గతంలో స్టార్ మా లో ప్రసారమయ్యే రెండు సీరియల్స్ లో ఈమె నటించారట.

"""/" / స్టార్ మా లో అప్పట్లో యువ ( Yuva ) అనే సీరియల్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఈ సీరియల్లో రష్మీ స్వాతి అనే పాత్రలో నటించారు.ఈ పాత్రకు ఎంతో మంచి ఆదరణ రావడంతో ఈమెకు తదుపరి లవ్ ( Love ) అనే మరొక సీరియల్ లో కూడా నటించే అవకాశం వచ్చింది.

ఇక ఈ సీరియల్ కూడా స్టార్ మా లోనే ప్రసారమైంది.ఇలా ఈ రెండు సీరియల్స్ మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వెండి తెరపై అవకాశాలు వచ్చాయి.

ఇక వెండి తెరపై సక్సెస్ కాకపోవడంతో తిరిగి బుల్లితెర యాంకర్ గా బుల్లితెరకు మాత్రమే పరిమితమయ్యారు.

రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి..!!