సౌండ్ లేకుండా ఎక్సప్రెషన్స్ ఇచ్చిన రష్మీ గౌతమ్.. వీడియోపై డబుల్ మీనింగ్ కామెంట్స్!

బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన రష్మీ గౌతమ్.యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది.

కెరీర్ మొదట్లో వెండితెరపై అడుగుపెట్టగా అందులో సైడ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది.కానీ అంత గుర్తింపు ఉన్న నటిగా మాత్రం పేరు సంపాదించుకోలేదు.

ఇక జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టాక తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.

పైగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.నిజానికి జబర్దస్త్ షో రష్మీ కి మంచి క్రేజ్ అందించింది.

ఈ షో ప్రారంభం నుంచి రష్మీ యాంకర్ గా కొనసాగుతుంది.ఇప్పటికి ఈ షో లోనే యాంకర్ గా కొనసాగుతుంది.

ఇందులో తన గ్లామర్ తో కుర్రాళ్లను బాగా ఫిదా చేస్తుంది.తన మాటలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.

ఇక మరో ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

అతనితో కలిసి తెగ రొమాన్స్ లు చేస్తూ బాగా రెచ్చిపోయింది.ఇదంతా షో కోసమే చేశారు ఈ జంట.

ఇక రష్మీ తెర ముందు ఇలా రెచ్చి పోతూ ఉంటే తెరవెనుక మాత్రం ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా నిలిచింది.

ఇక జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాంకర్ గా కొనసాగుతుంది.

అక్కడ కూడా యాంకర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఏదైనా ఈవెంట్లలో ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

తన డాన్స్ స్టెప్పులతో అందరినీ ఫిదా చేస్తుంది.ఇక రష్మీ సోషల్ మీడియాలో ఫుల్ బిజీ గా కనిపిస్తుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పంపించడమే కాకుండా.సమాజంలో జరిగే విషయాల గురించి కూడా బాగా పట్టించుకుంటుంది.

అంతేకాకుండా జంతువుల పట్ల తాను చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు.ఏదైనా మూగ జీవికి ఏమైనా అయితే వెంటనే రియాక్ట్ అవుతుంది.

కొన్నిసార్లు బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. """/" / గతంలో ఎన్నో మూగజీవుల స్టోరీలను పంచుకొని చాలా ఎమోషనల్ అయ్యింది.

నిజానికి ఈమె మూగ జీవులను ఎంతో ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది.వాటిని సరిగ్గా చూసుకోవాలి అని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేస్తూనే ఉంటుంది.

గతంలో లాక్ డౌన్ సమయంలో రష్మీ.రోడ్లపై జీవిస్తున్న మూగజీవుల దగ్గరికి వెళ్లి వాటికి భోజనం అందించింది.

అంత గొప్ప మనసున్న రష్మీ.ప్రతి రోజు ఏదో ఒక పోస్టు తో ఏదో ఒక విషయాన్ని తెలియజేయాలని చేస్తుంది.

అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది.ఇక తాజాగా తను తన సోషల్ మీడియా వేదికగా ఒక డాన్స్ వీడియో పంచుకుంది.

అయితే ఆ డాన్స్ వీడియోలో సౌండ్ లేకుండా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.దీంతో తను డాన్స్ చేసిన వీడియో పాట ఏంటో అని గెస్ చేయమని అడిగింది.

దీంతో కొందరు నెటిజెన్స్ ఆ సైలెంట్ వీడియోకు డబుల్ మీనింగ్ డైలాగులు కొడుతున్నారు.

మరికొందరు ఆ పాట ఏంటో చెబుతున్నారు.