యాంకర్ రష్మీ గౌతమ్ ఆశలు పెంచుతున్న బొమ్మ
TeluguStop.com
గుంటూరు టాకీస్ సినిమాతో అందరికి చేరువ అయిన జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కి ఆ తరువాత ఆ స్థాయిలో హిట్ రాలేదు.
తరువాత చేసిన సినిమాలు అన్ని కూడా ఏదో డబ్బు కోసం చేసినట్లు ఉంది తప్పా ఒక్కటి కూడా సరైన కంటెంట్ కాదు.
ఎక్కువగా హర్రర్ జోనర్ లో సినిమాలు చేస్తూ వచ్చింది.అయితే మళ్ళీ రెగ్యులర్ గా అలాంటి లో బడ్జెట్ సినిమాలు, కేవలం తన మీద మార్కెట్ చేసుకోవాలని అనుకునే సినిమాలని పక్కన పెట్టేసి తన ఆశలు వదిలేసుకొని యాంకర్ గా బిజీ అయిపొయింది.
ఇలాంటి సమయంలో ఊహించని అవకాశంగా ఓ డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్న సినిమాలో అమ్మడుకి ఛాన్స్ వచ్చింది.
నటుడు నందు విజయ్ కృష్ణ హీరోగా రాజ్ విరాట్ అనే కొత్త కుర్రాడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ తోనే అందరిని ఆకట్టుకున్నారు.
బొమ్మ బ్లాక్ బస్టర్ టైటిల్ తో విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ చిత్రంలో హీరో నందు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌కి అభిమానిగా నటిస్తున్నారని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా టైటిల్ నుంచి హీరో, హీరోయిన్స్ ఫస్ట్ లుక్ వరకు అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.
పోతురాజుగా నందు గడ్డంతో మాస్ క్యారెక్టర్ లో కనిపించనుండగా, రష్మీ పోతురాజు ప్రియురాలిగా నటిస్తుంది.
ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.ఈ టీజర్ విడుదల సందర్భంగా రష్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
టీజర్ దద్దరిల్లకపోతే నన్ను అడగండి.మార్కెట్‌లో మతి పోవాలి అంటూ రష్మీ చిత్ర పోస్టర్‌ను ట్వీట్ చేసింది.
ఆమె ట్వీట్ బట్టి ఈ బొమ్మ మీద రష్మీ చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాతో తిరిగి తనకి అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తుంది.ఈ సినిమాకి వస్తున్న బజ్ చూస్తూ ఉంటే ఆమె ఆశలు నెరవేరే విధంగానే ఉన్నాయి.
ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కి కూడా రెడీ చేసినట్లు తెలుస్తుంది.
కజకిస్థాన్‌లో విషాదం.. భారత వైద్య విద్యార్థి గుండెపోటుతో హఠాన్మరణం!