మొదటిసారిగా ప్రేమ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన రష్మీ... ఆ బాధ నాకు తెలుసు?

జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మీ ఒకరు.

ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో కేవలం జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుధీర్ తో కలిసి రష్మీ చేసే రచ్చ మామూలుగా ఉండదు.

ఈ క్రమంలోనే వీరిద్దరి జోడి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా,వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి చాలా మంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్దఎత్తున వార్తలు సృష్టించారు.

ఇలాంటి వార్తలు రావడంతో ఇదే అదునుగా భావించి పలు స్పెషల్ ఈవెంట్ లలో ఈ జంటకు పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా రష్మీ ఆటో రాంప్రసాద్ చెల్లెలిగా నటించారు.తన చెల్లికి పెళ్ళి చేయాలని అన్ని ఏర్పాట్లు చేయగా ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని రష్మీ నిద్రమాత్రలు మింగి చనిపోవాలని భావిస్తున్నట్లు చెబుతుంది.

"""/"/ ఈ క్రమంలోనే ప్రేమ గురించి రష్మీ ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ కంటతడి పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ మనం మనస్ఫూర్తిగా ఒకరికి మనసులో చోటిస్తే మన గుండె చప్పుడు ఆగిపోయే వరకు ఈ మనసులో స్థానం వారికే.

మనకు ఇష్టమైన వాళ్ళు మన పక్కన లేకపోతే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.

అయితే రష్మీ నిజంగానే తన మనసులో ఉన్న మాటను బయట పెడుతూ ఎమోషనల్ అయిందా లేకపోతే ప్రోమో కోసమే ఇలా చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

High Roller Tipps & Casino-Chat-Etikette: Vergleichsanalyse Für Erfahrene Spieler In Deutschland