బ్రేకప్ గురించి షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన హీరోయిన్ రాశీఖన్నా.. అలాంటి కష్టాలు అంటూ?
TeluguStop.com
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రాశీఖన్నా(rashikhanna) టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా పదేళ్లు అయినా ఇప్పటికీ వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
తెలుగులో స్టార్ హీరోలతో తక్కువ సినిమాల్లోనే నటించిన రాశీఖన్నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీ స్థాయిలోనే ఉంది.
బ్రేకప్(Break Up) గురించి రాశీఖన్నా షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాశీఖన్నా(rashikhanna) మాట్లాడుతూ వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్ పర్సన్ అని అన్నారు.గతంలో నాకో లవ్ స్టోరీ ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు.
కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందని రాశీఖన్నా తెలిపారు.ఆ సమయంలో ఎంతో బాధ పడ్డానని రాశీఖన్నా చెప్పుకొచ్చారు.
మానసికంగా కుంగుబాటుకు గురయ్యానని ఆమె తెలిపారు.ఆ తర్వాత నన్ను నేను మార్చుకుని స్ట్రాంగ్ గా నిలబడ్డానని రాశీఖన్నా కామెంట్లు చేశారు.
"""/" /
ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టానని సినిమా ఇండస్ట్రీతో పోల్చి చూస్తే బయటే నాకు ఫ్రెండ్స్ ఎక్కువని ఆమె తెలిపారు.
ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్(Family Members, Friends) నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారని వాళ్లే నా బలం అని ఆమె అన్నారు.
ఊహలు గుసగుసలాడే రిలీజ్ తర్వాత తిరుపతికి వెళ్లగా ఎక్కువ సంఖ్యలో జనాలు మమ్మల్ని చుట్టుముట్టారని ఆమె కామెంట్లు చేశారు.
"""/" /
ఫేమ్ గురించి అప్పటికి నాకు తెలియదని రాను రాను అలవాటు చేసుకున్నానని ఆమె అన్నారు.
ది సబర్మతీ రిపోర్ట్ రిలీజ్ (The Sabarmati Report Release)సందర్భంగా రాశీఖన్నా ఈ విషయాలను వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ తో రాశీఖన్నాకు భారీ విజయం దక్కాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాశీఖన్నాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ఆమె రెమ్యునరేషన్ సైతం పెరుగుతోంది.ఈ ప్రాజెక్ట్ తో రాశీఖన్నా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.