ఆఫ్ఘాన్ క్రికెట్‌ బోర్డుమీద భ‌గ్గుమంటున్న ర‌షీద్ ఖాన్‌.. ఎందుకంటే..?

తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్తాన్ దేశ సంగతి అందరికీ విదితమే.ఇకపోతే తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టమైనని వారు ప్రకటించుకున్నారు.

కాగా, ఆ దేశ క్రికెట్ బోర్డు మీద సదరు దేశానికి చెందిన క్రికెటర్ రషీద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

ఎందుకంటే.యూఏఈ, ఓమన్ వేదికలుగా ఐసీసీ మేల్ టీ20 వరల్డ్ కప్ త్వరలో జరగనున్నది.

ఈ క్రమంలోనే 15 మంది ప్రధాన ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ప్లేయర్స్ ప్లస్ కోచింగ్ సిబ్బంది సహాయక సిబ్బంది వివరాలను ఐసీసీకి పంపాల్సి ఉన్నది.

దాంతో ఆప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది.ఇద్దరు రిజర్వ్ ప్లేయర్స్ కూడా యాడ్ చేసింది.

రషీద్‌ఖాన్‌ను కెప్టెన్‌గా నియమించింది.ఈ వివరాలను ట్విట్టర్ వేదికగా తెలిపింది ఆప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు.

కాగా, ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని క్రికెటర్ రషీద్ ఖాన్ వ్యతిరేకిస్తున్నాడు.ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు తనను సంప్రదించకుండానే ప్లేయర్స్‌ను సెలక్ట్ చేసిందని, కెప్టెన్‌గా తన పర్మిషన్ లేకుండానే జట్టును ప్రకటించిందని, అందుకుగాను తాను కెప్టెన్సీకి రిజైన్ చేస్తున్నట్లు రషీద్ ఖాన్ తెలిపాడు.

"""/"/ ఈ మేరకు రషీద్ ట్వీట్ చేశాడు.తన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నాడు.

అయితే, ఆప్ఘనిస్తాన్ జట్టుకు ఆడటం తనకు ఎప్పుడూ గర్వకారణమే అని రషీద్‌ఖాన్ పేర్కొనడం గమనార్హం.

కెప్టెన్సీ నుంచి రషీద్ తప్పుకోవడంతో ఆ జట్టుకు ఆల్ రౌండర్ ఉన్న నబీ‌ని కెప్టెన్‌గా ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు నియమించనున్నట్లు సమాచారం.

ఆప్ఘన్ క్రికెట్ బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయని, క్రికెటేతరుల జోక్యం చాలా ఎక్కువైందని ఈ ఏడాది జులైలో ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) చీఫ్ సెలెక్టర్ అసదుల్లా ఖాన్ రాజీనామా చేశారు.

అప్పటి నుంచే ఆఫ్గాన్ జట్టు పరిస్థితి అధ్వానంగా తయారైందని రషీద్ ఖాన్ ఆరోపిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో చాలా మంది గతంలో జాతీయ జట్టుకు ఆడిన క్రికెటర్లున్నారని, కానీ, వాళ్లెవరిని ప్రజెంట్ జట్టులో కొనసాగడం లేదని రషీద్ పేర్కొన్నారు.

ఇకపోతే క్రికెట్‌ జట్టుకు గత మూడేళ్లుగా దూరంగా ఉంటున్న వారిని చేర్చడంపై రషీద్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు వినికిడి.

ఎంత లావుగా ఉన్నవారైనా రోజు ఈ డ్రింక్ తాగితే మల్లె తీగల మార‌తారు!