కేల్ మేయర్స్ క్యాచ్ ఔట్ తో గుజరాత్ ఖాతాలో ఘనవిజయం..!

తాజాగా ఆదివారం లక్నో- గుజరాత్( LSG Vs GT ) మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు 56 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తును కాయం చేసుకుంది.

గుజరాత్ జట్టు ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.ఒక మ్యాచ్ గెలిచిన గుజరాత్ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళుతుంది.

ఆడిన 11 మ్యాచ్లలో 8 మ్యాచ్లలో గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఐపీఎల్ ( IPL ) చరిత్రలో ఈ మ్యాచ్ చాలా స్పెషల్.ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములుగా తలపడడం ఇదే మొదటిసారి.

లక్నో జట్టుకు కెప్టెన్ గా కృనాల్ పాండ్యా,( Krunal Pandya ) గుజరాత్ జట్టు కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా లు( Hardik Pandya ) మ్యాచ్ లో తలపడుతుంటే ఎవరు గెలుస్తారు అని ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపింది.

"""/" / మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టులో వృద్ధి మాన్ సహా 81, శుబ్ మన్ గిల్ 94 పరుగులతో అద్భుత ఆటను ప్రదర్శించారు.

వీరిద్దరి పరుగులకు హార్దిక్ పాండ్యా 25, డేవిడ్ మిల్లర్ 21 పరుగులు జోడించడంతో రెండు వికెట్ల నష్టానికి గుజరాత్ జట్టు 227 భారీ స్కోరు నమోదు చేసింది.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన లక్నో జట్టు కూడా శుభ ఆరంభమే ప్రారంభించింది.

దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.డికాన్ 70, కేల్ మేయర్స్ 48 పరుగులతో దూకుడు ఆటలు ప్రదర్శించారు.

"""/" / ఇక మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని ఊహించే లోపే కేల్ మేయర్స్ క్యాచ్ ను రషీద్ ఖాన్ పట్టడంతో లక్నో జట్టు ఇబ్బందుల్లో పడింది.

ఇక గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి 56 పరుగుల తేడాతో లక్నో జట్టు ఘోర ఓటమి ఖాతాలో వేసుకుంది.

హార్థిక్ పాండ్యా విజయం పై స్పందిస్తూ.కేల్ మేయర్స్ క్యాచ్ ను రషీద్ ఖాన్ పట్టడం వల్లనే మ్యాచ్ ఫలితాలు తారుమారు అయ్యాయని తెలిపాడు.

ఇరుజట్లు కూడా ఆరంభం నుంచే దూకుడుగా ప్రదర్శించాయని, ఆ క్యాచ్ వల్ల లక్నో వెనకబడి ఓడిందని తెలిపాడు.

దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ 4 సినిమాలు చాలా స్పెషల్ గా నిలిచాయా..?