గాసిప్స్ కి నా దగ్గర సొల్యూషన్ ఉంది అంటున్న అందాల రాశి

టాలీవుడ్ ప్రస్తుతం వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా రాశి ఖన్నా ఉంది.

యువ హీరోలకి జోడీగా నటిస్తున్న ఈ భామ స్టార్ హీరోలతో అవకాశాలు అందుకోలేకపోయిన మినిమం హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా ఉంది.

దీంతో రాశి ఖన్నాకి తెలుగులో అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.తాజాగా ప్రతిరోజు పండగే సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాశి ఖన్నా చేతిలో తమిళంలో రెండు సినిమాలు తెలుగులో ఓ రెండు సినిమాల వరకు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ మధ్య అమ్మడుపై కొన్ని నెగిటివ్ గాసిప్స్ వినిపించాయి.వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఆమె చేసిన పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేసిందని ప్రచారం జరిగింది.

అలాగే ఓ యువ హీరోతో ప్రేమాయణం సాగిస్తుంది అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.తాజాగా రాశి ఖన్నా ఇలాంటి గాసిప్స్ గురించి తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యింది.

ఇండస్ట్రీలో ఉన్న తర్వాత గాసిప్స్ అనేవి వస్తూ ఉంటాయి.అయితే వాటిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోతా.

ఎవరినీ పోటీగా భావించను.నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకోను.

ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతాను.తెరపై నేను ఎలా కనిపించినప్పటికీ, బయట మాత్రం ఆధ్యాత్మికతతో నిండి ఉంటా.

కాస్తా బిడియం కలిగిన అమ్మాయిగానే కనిపిస్తాను.ఏ విషయంలోనైనా ఆర్భాటాలకు పోకుండా సింపుల్ గా ఉండటానికి నేను ఇష్టపడతాను అని చెప్పుకొచ్చింది.

`.

టీడీపీ మేనిఫెస్టో పై జగన్ కీలక వ్యాఖ్యలు..!!