డ్యాన్స్ వేసిన రాశి ఖన్నా.. దేవుడా అంటూ ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్.. నెటిజన్స్ ట్రోల్స్?
TeluguStop.com
టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ రాశిఖన్నా పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
ఇక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసింది.
ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇక బాలీవుడ్ సినిమాతో తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా.
ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది.మొదట అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.
ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశిఖన్నా ఇప్పుడు మొత్తానికి సన్నబడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
తను సన్నబడ్డాక.ఫోటోలతో బాగా రెచ్చిపోయింది.
ఇక బికినీ లో కూడా ఓ షాక్ ఇచ్చింది.ఇక బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సన్నగా కావటానికి కారణమేంటంటే గతంలో తనకు సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో అలా సన్నబడింది.
దీంతో తన అందాలను సోషల్ మీడియా వేదికగా అందరికీ మరోసారి పరిచయం చేసింది.
"""/"/
నిజానికి ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నప్పుడే చాలా క్యూట్ గా ఉండేది.
కానీ సన్నబడ్డాక ఎందుకో అంత అందాన్ని తెచ్చుకోలేకపోయింది అన్నట్లు అనిపించింది.ఇక ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది.
అందులో తను ఒక పాటకు చాలా క్లిప్స్ తో డాన్స్ చేసి చూపించింది.
అది తనే చేశాను అన్నట్లు చెప్పుకొచ్చింది కూడా.ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న కొద్ది క్షణంలోనే విపరితమైన లైక్స్ తో పాటు కామెంట్ కూడా వచ్చాయి.
ఇక తన డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ కూడా ఆ వీడియోలో ఆయనతో పాటు మరో ఇద్దరు ఆడవాళ్లు కూడా కనిపించారు.
అయితే ఆ వీడియోని చూసిన ప్రీతమ్ ఓ మై గాడ్ సో క్యూట్ అంటూ కొన్ని ఎమోజిస్ తో కామెంట్ చేశాడు.
"""/"/
దీంతో అందరూ మళ్లీ అతడిని టార్గెట్ చేశారు.ఇక ఇప్పుడు రాశిఖన్నాను కూడా వదలవా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎందుకంటే గతంలో సమంత విడాకుల సమయంలో ఇతడి పేరు హాట్ టాపిక్ గా మారింది.
ఇతడి వల్లే సమంతకు విడాకులు జరిగాయని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.ఇతడితో సమంత చాలా క్లోజ్ గా ఉంటుంది అని.
అందుకే నాగచైతన్యకు, సమంతకు ఇతడి వల్ల భేదాభిప్రాయాలు వచ్చాయని టాక్ అయితే వచ్చింది.
అయితే ఇప్పుడు రాశిఖన్నాతో కనిపించడంతో ఇప్పుడు ఈమెను టార్గెట్ చేస్తున్నావా అంటూ.ఇక ఈమెను కూడా వదలవా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక రాశి ఖన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తుంది.