ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్న యువతి.. ఈమె లక్ష్యం తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
ఈ మధ్య కాలంలో పెళ్లి పేరుతో మోసపోతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
పెళ్లి కాని వాళ్లను టార్గెట్ చేసి కొంతమంది యువతులు, యువకులు ఈ తరహా మోసాలకు తెరలేపుతున్నారు.
తాజాగా ఒక యువతి ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని మోసం చేసిన ఘటన తెరపైకి వచ్చింది.
ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలలో ఈ యువతి పెళ్లి పేరుతో పలువురు యువకులను మోసం చేసింది.
పెళ్లైన కొన్నిరోజులకే ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకుని పారిపోవడమే లక్ష్యంగా ఈ యువతి పెళ్లిళ్లు చేసుకునేది.
ఈ యువతి రషీద( Rasheeda ) అనే పేరుతో పరిచయం చేసుకుని సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తితో వివాహానికి ఓకే చెప్పింది.
ఈ ఏడాది మార్చి నెల 30వ తేదీన వీళ్లిద్దరి వివాహం జరగగా పెళ్లి జరిగిన కొన్ని రోజులకే వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడం గమనార్హం.
"""/" /
జులై నెల 4వ తేదీన రషీద లక్షన్నర రూపాయల నగదుతో పాటు 5 సవర్ల బంగారు నగలతో అదృశ్యమయ్యారు.
మూర్తి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు( POLICE ) దర్యాప్తు చేయగా పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సోషల్ మీడి( Social Media )యాలో ఫేక్ అకౌంట్లను ఓపెన్ చేసి ఆ అకౌంట్ల ఆధారంగా ఈ యువతి డబ్బున్న వాళ్లను గుర్తించి వాళ్లతో పరిచయం పెంచుకునేది.
"""/" /
అవతలి వ్యక్తుల నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చేలా చేసి ఆ ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆ వ్యక్తులను పెళ్లి చేసుకుని ఈ యువతి తర్వాత నగలు, డబ్బు తీసుకుని పారిపోయేది.
కేరళ, కర్ణాటక, ఏపీలో ఇప్పటివరకు ఈ యువతి ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
పరారీలో ఉన్న రషీద పోలీసుల చేతికి చిక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.డబ్బు, నగలు తీసుకుని పరారీ కావడమే ఈ యువతి లక్ష్యమని తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.
వీడియో వైరల్: జగన్నాథుడికి వినంభ్రంగా ప్రార్థించిన కోడి..