అరుదైన వివాహం: వరుడు 36 అంగుళాలు, వధువు 34 అంగుళాలే.. పెళ్ళైతే సూపర్ గా జరిగింది!
TeluguStop.com
ఎలాంటి బీద కుటుంబానికి చెందినవారైనా, పెళ్లిళ్లు విషయంలో మాత్రం అస్సలు తగ్గరు.ఎంతైనా జీవితంలో ఒక్కసారి మాత్రం జరిగేది కదా.
దాంతో దాదాపు అందరూ తేడా లేకుండా వున్న దాంతోనే అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిపిస్తారు.
ఖర్చుకు వెనకాడకుండా జీవితాంతం గుర్తుండిపోయే లాగ ప్రత్యేకంగా మార్చుకుంటున్నారు నేటి తరం.అందువలనే ఇపుడు ఫోటో గ్రాఫర్లకు ఎక్కడాలేని డిమాండ్ వున్నది.
ఒకప్పుడు జెస్ట్ పెళ్లి తంతులోనే ఏవో కొన్ని ముఖ్యమైన ఫోటోలు తీసి మమా అనిపించేసేవారు.
ఇపుడు ట్రెండ్ మారింది.పెళ్ళికి ముందు, తరువాత అని వీడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయంటే, ఇక అర్ధం చేసుకోండి మరి.
ఇక సోషల్ మీడియా పుణ్యమాని ఇలాంటి పెళ్లిళ్లకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని మనం విరివిగా చూడవచ్చు.
ఐతే వాటిలో కొన్ని వీడియోలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.ఇపుడు అలాంటి ఓ పెళ్ళికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
సాధారణంగా మన చుట్టూ పెళ్ళి చేసుకోవాలనుకున్న యువతి యువకుల హిట్ కొంచెం అటు ఇటుగా 5 అడుగుల పైనే ఉంటుంది.
అయితే ఇక్కడ పెళ్లి చేసుకున్న జంట మాత్రం ఎంతో ప్రత్యేకం అనే చెప్పుకోవాలి.
హైట్ మాకు అవసరం లేదు.జీవితాంతం కలిసి ఉండే ప్రేమ మా దగ్గర ఉంది అని ఇక్కడ ఒక జంట నిరూపించింది.
"""/"/
వివరాల్లోకి వెళితే, బీహార్లోని భాగల్పూర్ లో గోపాల్పూర్ బ్లాక్ లో ఇద్దరు మరుగుజ్జు వధూవరులకు పెళ్లి ఘనంగా జరిపించారు.
వరుడు ఎత్తు కేవలం 36 అంగుళాలు ఉండగా, వధువు వధువు ఎత్తు 34 అంగుళాలు కావడం గమనార్హం.
ఇద్దరు తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.ఈ నేపథ్యంలో ఈ జంటతో ఫోటోలు దిగేందుకు అక్కడున్న వారు పోటీ పడ్డారు.
తాను డాన్స్ పార్టీలో ఆర్టిస్టుగా పని చేస్తానని తన భార్యకు ఎలాంటి సమస్య రాకుండా ఎంతో సంతోషంగా చూసుకుంటాను అని అతగాడు చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అన్ స్టాపబుల్ షోకు హాజరు కాని ఈ హీరోలు రానా షోకు అయినా హాజరవుతారా?