కోహ్లీకి అరుదైన గౌర‌వం.. దుబాయ్‌లో మైన‌పు విగ్ర‌హం ఏర్పాటు

అత‌న్ని అభిమానులు ముద్దుగా క్రికెట్ కింగ్ అని పిలుచుకుంటారు.అత‌ను గ్రౌండ్లో ఉంటే చాలు మ్యాచ్ ప‌క్కా గెలుస్తామ‌నేంత భ‌రోసాతో ఉంటారు అభిమానులు.

మ‌రి అత‌ను కూడా అదే స్థాయిలో ఆడుతూ అభిమానుల అంచ‌నాల‌ను నిజం చేస్తుంటాడు.

అందుకే అత‌న్ని క్రికెట్ అభిమానులు అంత‌లా ఇష్ట‌ప‌డుతారు.ఆయ‌నే విరాట్ కోహ్లీ.

ఈ పేరు విన‌గానే క్రికెట్ అభిమానుల‌కు ఓ విధ‌మైన అనుభూతి క‌లుగుతుంది.అత‌ని ఆట‌కు ఫిదా కాని వారంటూ ఉండ‌రు.

స‌చిన్ వార‌సుడిగా దూసుకుపోతున్న విరాట్‌కు ఇప్పుడు ఓ అరుదైన గౌర‌వం ద‌క్కింది.సాధార‌ణంగానే విరాట్‌కు ఇప్ప‌టికే ఎన్నో దేశాలు గౌర‌వం ఇచ్చే విధంగా ఏదో ఒక‌టి చేస్తున్నాయి.

కాగా ఇప్పుడు దుబాయ్ ఆ బాధ్య‌త తీసుకుంది.దుబాయ్‌లో నూత‌నంగా స్టార్ట్ అయిన‌టువంటి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం కోహ్లీకి అరుదైన గిఫ్ట్ ఇచ్చింది.

అదేంటంటే ఈ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్కరించారు.త్వ‌ర‌లోనే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ విగ్ర‌హం ఇప్పుడు కోహ్లీ అభిమానుల‌కు మంచి కిక్ ఇస్తోంది.

ఈ మ్యూజియానికి ఓ ప్ర‌త్యేకత కూడా ఉంది.ఇందులో ఫుట్ బాల్ స్టార్స్ అయిన‌టువంటి రొనాల్డో, మెస్సీ లాంటి వారి విగ్ర‌హాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు వారి స‌ర‌స‌న కోహ్లీ విగ్ర‌హం కూడా చేరిపోయింది.ఇక కోహ్లీ విగ్రహాన్ని ఇండియ‌న్ టీమ్ పొట్టి ఫార్మాట్ డ్రెస్ లో తీర్చిదిద్దారు నిర్వాహ‌కులు.

ప్ర‌స్తుతం కోహ్లీ విగ్ర‌హానికి సంబంధించిన‌టువంటి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక ఇది చూసిన వారంతా కూడా కెప్టెన్ ను అభినందిస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

గ్లోబల్ సూపర్ స్టార్ గా అభిమానంచే అభిమానులు త‌మ స్టార్‌కు అరుదైన గౌరవం దక్కిందంటూ మురిసిపోతున్నారు.

ఇక రానున్న టీ20 ప్రపంచకప్ త‌ర్వాత కింగ్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్సీ నుంచి దూర‌మ‌వుతున్నాడ‌న్న విష‌యం తెలిసిందే.

నా ఒంటి రంగును చూసి నేనెప్పుడూ గర్వపడతాను : అర్చన