కారు అపి మరి పిస్టల్ తో కాల్చేస్తా అని హీరోయిన్ రజిని ని బెదిరించింది ఎవరు ?
TeluguStop.com
80 వ దశకంలో స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందిన నటీమణుల్లో రజిని కూడా ఉంటుంది.
ఆమె చేసింది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ఇండస్ట్రీలో ఆమెకు మంచి పాత్ర లభించాయి.
రాజేంద్రప్రసాద్ వంటి హీరోతో రజనీకి ఏదో ఒక సంబంధం ఉంది అంటూ కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ప్రచారం సాగింది.
వాస్తవానికి ఆమెకు గాడ్ ఫాదర్స్ వంటి వారు ఎవరూ లేరు.ఆమె ఎక్కువగా దాసరి ఏం చెప్పినా వినేది.
ఏ సినిమాలో చేయమంటే అందులోనే చేసేది.ఆమెకు సంబంధించిన అంతవరకు దాసరి నారాయణరావు ఆమెకి గాడ్ ఫాదర్ లాంటివారు.
"""/"/
ఇక తన డేట్స్, సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా దాసరి స్వయంగా చూసుకునేవారు.
ఆమెను కలవాలన్నా కూడా దాసరి అనుమతి తప్పకుండా ఉండాల్సిందే.అదే ఆమె కెరియర్ కి మంచి ప్లస్ పాయింట్ మరియు మైనస్ కూడా అయింది.
ఆమె కెరియర్ లో తక్కువ సినిమాల్లో చేసిన మంచి సినిమాల్లో చేయడానికి దాసరి బాగా ఉపయోగపడ్డాడు.
మజ్ను వంటి గొప్ప సినిమాలో ఆమె నటించింది ఈ సినిమాకి దాసరి దర్శకుడు.
అయితే రజిని ఓ సినిమాలో నటిస్తుండగా ఆమెను పిస్టల్ తో కాల్చి చంపేస్తానని బెదిరించాడట ఒక ప్రొడ్యూసర్.
అతను మరెవరో కాదు ఎన్టీఆర్ తమ్ముడైన త్రివిక్రమ్ రావు.త్రివిక్రమ రావు కుమారుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి హీరోగా రజనీ హీరోయిన్ గా మేనమామ అనే ఒక సినిమా వచ్చింది.
"""/"/
ఈ సినిమా షూటింగ్ జరిగిన రోజు రజిని లేటుగా వచ్చింది.అంతేకాదు వచ్చి షూటింగ్ చేయకుండానే తిరిగి వెళ్ళిపోతూ కారెక్కుతున్న రజిని ని ఆపి త్రివిక్రమ రావు షూటింగ్ చేయకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగాడు.
తనకు రావాల్సిన డబ్బు రాలేదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి కారు ఎక్కబోయింది.
దాంతో కోపానికి వచ్చిన త్రివిక్రమ్ రావు ఆయన దగ్గర ఉన్న పిస్టల్ తీసి రజనీకి గురి పెట్టి నీ షూటింగ్ పూర్తి చేసుకుని నీకు రావాల్సిన బకాయి సాయంత్రం తీసుకుని వెళ్ళు అంటూ బెదిరించారట.
దాంతో భయపడ్డ రజిని సినిమా షూటింగ్ పూర్తి చేసి సాయంత్రం పేమెంట్ తీసుకొని వెళ్లిపోయిందట.
వెళ్లిపోతున్నా రజినీకి త్రివిక్రమ రావు ఓ సలహా కూడా ఇచ్చారట.నువ్వు షూటింగ్ కి లేటుగా రావడం వల్ల సినిమా యూనిట్ కి ఎంతో ఇబ్బంది ఉంటుంది.
అందరి డేట్స్ మళ్ళీ దొరకవు.ఇలా చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేవు అంటూ చెప్పారట.
గేమ్ ఛేంజర్ పాట ఖర్చు లెక్క తెలిస్తే షాకవ్వాల్సిందే.. బాక్సాఫీస్ షేక్ కానుందా?